ETV Bharat / bharat

కరోనా టీకాలకు త్వరలోనే అనుమతి: కేంద్రం

భారత ఔషధ నియంత్రణ సంస్థ పరిగణనలో మూడు వ్యాక్సిన్ క్యాండిడేట్లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మూడింటిలో ఒకదానికి లేదా అన్నింటికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

3 COVID-19 vaccine candidates under active consideration of drug regulator: Health Ministry
టీకాలకు త్వరలోనే అనుమతి: కేంద్రం
author img

By

Published : Dec 8, 2020, 9:00 PM IST

భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్‌ సహా మూడు కొవిడ్‌-19 వ్యాక్సిన్ క్యాండిడేట్లు భారత భారత ఔషధ నియంత్రణ సంస్థ పరిగణనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. కొవాగ్జిన్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న 3 టీకాలకు లేదా.. మూడింట్లో ఒకదాని వినియోగానికి త్వరితగతిన అనుమతులు రావొచ్చని పేర్కొంది.

అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఈ మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలు గడచిన 4 రోజుల వ్యవధిలో భారత ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తులు చేసుకున్నాయి. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చేందుకు.. సంబంధిత చట్టంలో వెసులుబాట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మొత్తం 9 టీకాలు..

దేశంలో ఎనిమిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. సీరం, ఆస్ట్రాజెనెకా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పారు. భారత్​ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై.. మూడో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నాయని వివరించారు. అత్యవసర వినియోగార్థం ఈ రెండు టీకాలు డీజీసీఐకి దరఖాస్తులు చేసుకున్నాయని స్పష్టం చేశారు. రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ ట్రయల్స్​ను భారత్​లో డా. రెడ్డీస్ ల్యాబ్స్ నిర్వహిస్తోందని.. వచ్చే వారం మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. నొవావాక్స్​తో సీరం ఇన్​స్టిట్యూట్ తయారుచేస్తున్న 'ఎన్​వీఎక్స్​-సీఓవీ2373' టీకా ఫేజ్ 3 ట్రయల్స్​లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ సైతం నియంత్రణ సంస్థ పరిగణలో ఉందని స్పష్టం చేశారు.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన టీకా ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని తెలిపారు. మొదటి, రెండో దశ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైనట్లు తెలిపారు భూషణ్. ఈ టీకాను హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు.

అమెరికాకు చెందిన హెచ్​డీటీ బయోటెక్ కార్పొరేషన్ తయారుచేసిన హెచ్​జీసీఓ19 టీకా.. జంతువులపై ప్రయోగాలు పూర్తయ్యాయని... ఫేజ్ 1, 2 ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ టీకాను పుణెలోని జెనోవా సంస్థ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు.

భారత్​ బయోటెక్ ఇంటర్నేషనల్, థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ(అమెరికా) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా ప్రీ-క్లినికల్ దశలో ఉందని భూషణ్​ స్పష్టం చేశారు. అరబిందో ఫార్మా తయారుచేసే టీకా ప్రారంభ దశలో ఉందని పేర్కొన్నారు. మొత్తంగా తొమ్మిది టీకాల్లో మూడు ప్రీ-క్లినికల్, ఆరు టీకాలు క్లినికల్ దశల్లో ఉన్నాయని వివరించారు.

కోల్డ్ చైన్ సౌకర్యాలపై..

ప్రస్తుత కోల్డ్​ చైన్ వ్యవస్థకు మూడు కోట్ల కరోనా డోసులను నిల్వ చేసే సామర్థ్యం ఉందని తెలిపారు భూషణ్. 85,634 వ్యాక్సిన్ స్టోరేజీ పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. 28,947 కోల్డ్ చైన్ పాయింట్ల వద్ద వీటిని నిల్వ చేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం ఫ్రంట్​లైన్ హెల్త్​ వర్కర్ల సమాచారాన్ని కో-విన్ సాఫ్ట్​వేర్​లో పొందుపర్చినట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.