గుజరాత్‌లోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన 20 మందికిపైగా ఉద్యోగులకు వైరస్ సోకింది. ఫలితంగా దేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన అహ్మదాబాద్‌లోని క్యాడిలా ఫార్మా సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేశారు అధికారులు. ఈ కంపెనీలో దాదాపు 26మందికి కొవిడ్-19 నిర్ధరణ అయింది. గత వారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఐదుగురికి కరోనా నిర్ధరణ కాగా.. తాజాగా ఈ ఒక్కవారంలోనే 21మందికి సోకింది.
సంస్థలో పనిచేసే మరో 95మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మందుల తయారీకి కావల్సిన ఏపీఐలను క్యాడిలా భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో గుజరాత్‌లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు గుజరాత్‌లో 7012పాజిటివ్ కేసులు నమోదుకాగా 425మంది మృత్యువాతపడ్డారు.
ఇదీ చదవండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు