అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేసి, నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ... వేర్వేరు సంస్థలు తమ వంతు సాయంగా ఈ మహాక్రతువులో భాగం అవుతున్నాయి. కర్సేవక్పురంలో ఇప్పటికే స్తంభాలు, శిల్పాలు చెక్కే పని జోరుగా సాగుతుండగా... ఆలయానికి అవసరమయ్యే ప్రత్యేక గంటను ఎటా జిల్లా జలేసర్‌లో తయారుచేయిస్తోంది 'రామ్‌లల్లా'.
వేర్వేరు లోహాలు ఉపయోగించి 2 వేల 100 కిలోలు బరువైన గంటను తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2 నెలలుగా అనేక మంది కార్మికులు శ్రమిస్తున్నారు. వీరిలో కొందరు ముస్లింలూ ఉండడం విశేషం.
"ఈ గంట బరువు సుమారు 2100 కిలోలు. ఇది పూర్తవడానికి 2,3 నెలలు పడుతుంది. రూ. 12-15 లక్షల వ్యయంతో దీనిని రూపొందిస్తున్నాం. ఈ గంట తయారు చేయమని గతంలో కాశీ నుంచి ఆర్డర్ వచ్చింది. సుప్రీం తీర్పు తర్వాత పనుల్లో వేగం పెంచాం."
-వికాస్ మిత్తల్, గంట తయారీదారుడు
ఇదీ చూడండి : 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ