కేరళ అలప్పుళలోని పున్నమద సరస్సులో 2019 నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ 67వ పడవ పోటీలతోనే ఛాంపియన్స్ బోట్ లీగ్(సీబీఎల్) కూడా మొదలైంది. సీబీఎల్ను రాష్ట్ర పర్యటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రారంభించారు. చున్దన్ వల్లం, చురులన్ వల్లం, వెప్పు వల్లం సహా వివిధ రకాలకు చెందిన 79 పడవలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
పడవల రేస్ చూసేందుకు స్థానికులు, పర్యటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చూడండి:- ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!