ఉత్తరప్రదేశ్ కన్నౌజ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
''చాలామంది ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారందరికీ నా సంతాపం ప్రకటిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.''
-నరేంద్ర మోదీ, ప్రధాని
ఈ దుర్ఘటనపై... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
''కన్నౌజ్ రోడ్డు ప్రమాదంలో 20 మందికిపైగా చనిపోయారని తెలియగానే చాలా బాధేసింది. చాలామంది గాయపడ్డారని విన్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.''
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో శుక్రవారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొనడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.
ఇదీ చదవండి:విద్యుత్తు కంచెను దాటేందుకు గజరాజు విశ్వప్రయత్నం