ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో నక్సలైట్లు- భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.
ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పామెడ్లోని అడవుల్లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు- తెలంగాణ గ్రేహౌండ్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా సిబ్బందిని గుర్తించిన నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరో 15 మంది...
ఈ ఘటన అనంతరం 15 మంది మావోయిస్టులు బీజాపుర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. వీరిందరిపై తలో లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు ఎస్పీ గోవర్ధన్ ఠాకుర్ తెలిపారు.
ఇదీ చూడండి: శ్రీలంకలో వరుస పేలుళ్లు- 140 మంది మృతి