ETV Bharat / bharat

మసాలా దోశ కల్తీ- హోటల్​కి రూ.2.10లక్షల ఫైన్​

'దోశ కల్తీ' ఘటనలో ఉత్తరప్రదేశ్​లోని వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏకంగా రూ.2.10 లక్షలు జరిమానా విధించారు. కల్తీ ఘటనలు పునరావృత్తం కాకుండా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Up_var_1_food_item_fine_upc
మసాలా దోశ కల్తీ చేసిన హోటల్​కి రూ.2.10లక్షల జరిమానా
author img

By

Published : Feb 5, 2021, 1:20 PM IST

వివిధ ఆహార పదార్థాల కల్తీ గురించి వింటూంటాం. అయితే కల్తీ రాయుళ్లకు శిక్షలు పడే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో మాత్రం కల్తీకి తావులేని సమాజాన్ని నిర్మించాలని సంకల్పించారు జిల్లా మేజిస్ట్రేట్. 'మసాలా దోశ' మిశ్రమాన్ని కల్తీ చేసినందుకు ఓ హోటల్‌కు ఏకంగా రూ.2లక్షల 10 వేలు జరిమానా విధించారు. గతేడాది కాలంగా పలు కల్తీ కేసుల్లో రూ.40.5లక్షల జరిమానాలు విధించారు. ప్రజలకు మెరుగైన ఆహార పదార్థాలు అందించే దిశగా కృషి చేస్తున్నారు.

కల్తీపై యుద్ధం..

జిల్లా మేజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ సూచనల మేరకు కల్తీ ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించింది జిల్లా అధికార యంత్రాంగం. కల్తీ నిరోధానికి చేసిన ఈ ప్రయత్నానికి పౌరుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజల సహకారంతో వివిధ హోటళ్లు, దుకాణాల నుంచి నమూనాలు సేకరించిన ఆహార నియంత్రణ అధికారులు.. లఖ్​నవూ ప్రయోగశాలలో పరీక్షిస్తారు. కల్తీ ధ్రువీకరణ అయితే నిందితులపై కేసులు నమోదు చేస్తారు .

ఈ కేసులను త్వరితగతిన విచారించి తుది తీర్పును వెల్లడించేలా జిల్లా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ఆ విధంగా.. 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి మధ్య వివిధ కేసుల్లో 40లక్షల 54వేల రూపాయలు జరిమానా విధించారు. కల్తీకి పాల్పడిన సంస్థల్లో నగరానికి చెందిన ప్రతిష్టాత్మక హోటల్​ సైతం ఉండటం గమనార్హం.

జనవరిలోనే అధికం..

కల్తీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం.. నిర్దిష్ట ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న 157 నమూనాలను సేకరించింది. కేవలం జనవరి 21లోపు వచ్చిన కేసులలో రూ.7.57 లక్షల జరిమానా విధించడం విశేషం. పరీక్షించిన వాటిలో పాలు, నూనె, జున్ను, బేకరీ పదార్థాలు, స్వీట్లు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: పౌష్టికాహార లోపంతో గిడసబారుతున్న దేశభవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.