ప్రపంచ దేశాలతో పాటు భారత్లో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించి, శానిటైజర్లను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే రాజస్థాన్ జైపుర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో ఏకంగా 2.5 లక్షల మాస్కులు కనిపించకుండా పోయాయి. వీటి విలువ సుమారు రూ.10కోట్లు.
ఈ ముసుగులను ఐసోలేషన్ వార్డుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులు, నర్సుల కోసం తెప్పించారు. ఎన్-95 క్వాలిటీతో తయారు చేసిన ఒక్కో మాస్కు ధర రూ.400. విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.