ETV Bharat / bharat

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

సార్వత్రిక ఆరో దశ పోలింగ్​లోనూ ఈవీఎం మొరాయింపులు ఈసీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ దిల్లీలోని పలుచోట్ల ఆలస్యంగా మొదలైంది. బంగాల్​లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటాల్​ నియోజకవర్గ భాజపా అభ్యర్థి భారతి ఘోష్​ వాహనశ్రేణిపై దాడి జరిగింది.

author img

By

Published : May 12, 2019, 11:56 AM IST

Updated : May 12, 2019, 12:11 PM IST

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటున్నా ఈవీఎం సమస్యలు మాత్రం వదలడం లేదు. దేశ రాజధాని దిల్లీలోని రైల్వే జుగ్గి, షకుర్​బస్తీ సహా పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు ఓటర్లతో పాటు ఈసీకి తలనొప్పి తెచ్చి పెట్టింది.

వేసవి కావడం వల్ల ఎండ తాకిడికి తట్టుకోలేక ఉదయాన్నే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే ఈవీఎంల మొరాయింపుతో 3 పోలింగ్​ కేంద్రాల్లో 50 నిమిషాలు ఆలస్యంగా ఓటింగ్​ ప్రారంభమైంది. అప్పటివరకు ఓటర్లు క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ఓటర్లు ఈసీపై అసహనం వ్యక్తం చేశారు.

బంగాల్​లో మళ్లీమళ్లీ...

ఆరో విడత పోలింగ్​లోనూ బంగాల్​లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘాటాల్​ లోక్​సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భారతి ఘోష్​ వాహనశ్రేణిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తృణమూల్​ కార్యకర్తలే దాడి చేశారని భాజపా నేతలు ఆరోపించారు.

కాల్పుల కలకలం...

ఆరోదశ పోలింగ్​ ముందు రోజు బంగాల్​లో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాడ్​గ్రామ్​ నియోజకవర్గ పరిధిలోని గోపిబళ్లాపుర్​లో భాజపా కార్యకర్త శనివారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మరో ఇద్దరు కార్యకర్తలపై కాల్పులు జరిగాయి.

East Midnapore (West Bengal), May 12 (ANI): In yet another case of political violence in West Bengal, two local BJP workers were allegedly shot by TMC goons on May 11 late night in East Midnapore. BJP workers were severely injured. Local people rescue and took them to the hospital. They are under treatment at the hospital. Investigation is underway. No one has been arrested yet.
Last Updated : May 12, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.