మహారాష్ట్ర లాతుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతిపై పెట్రోల్ పోసి దుండగులు.. నిప్పంటించారు. యువతి ముఖం కాలిపోగా.. 15 శాతం గాయాలతో ఉన్న ఆమెను లాతుర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు స్థానికులు.
యువతి ఇంటి ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మహారాష్ట్రలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు రోజుల్లో రాష్ట్రంలో ఇది మూడో ఘటన. ఇటీవల వార్దా జిల్లాలో లెక్చరర్‌పై మాజీ ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరువకముందే తాజా దాడి జరిగింది.
ఇదీ చూడండి: లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు