దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ ఘటన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన బాలికల అత్యాచారాలు, అపహరణలకు సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా యూపీలోని బాగ్పత్ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత బాలిక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
సెప్టెంబర్ 27 విషం తాగింది అత్యాచార బాధితురాలు. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె.. తనపై జరిగిన ఘోరాన్ని తండ్రికి వివరించింది. అత్యాచారానికి పాల్పడింది పొరుగింటి వ్యక్తి నసీమ్ అని తెలిపింది. అనంతరం బాధితురాలి తండ్రి సెప్టెంబర్ 29న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని నిందితుడు నసీమ్ను అరెస్ట్ చేశారు.
తన కూతురిపై అత్యాచారం మాత్రమే జరగలేదని, బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు.
ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి: హాథ్రస్ ఘటనలో ట్విస్ట్- బాధితురాలిపై అత్యాచారం జరగలేదు!