ETV Bharat / bharat

మోదీ కార్యక్రమాల్లో 'అయోధ్య భూమిపూజ' టాప్​

అయోధ్యలో రామాలయ భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని రికార్డు స్థాయిలో 16.3 కోట్ల మంది వీక్షించారు. మొత్తం 730 కోట్ల వీక్షణ నిమిషాలు నమోదైనట్లు బార్క్ వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాల్లో అయోధ్య భూమిపూజ టాప్​లో నిలిచిందని తెలిపింది.

BIZ-TV-BARC-AYODHYA
అయోధ్య భూమిపూజ
author img

By

Published : Aug 27, 2020, 11:09 PM IST

అయోధ్య రామమందిర భూమిపూజను 16.3కోట్ల మంది వీక్షించారని బ్రాడ్​కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్​) వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం 198 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని తెలిపింది.

ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగిన భూమిపూజ కార్యక్రమం.. మొత్తం 730 కోట్ల వీక్షణ నిమిషాలను నమోదు చేసినట్లు బార్క్ చెబుతోంది. ఇటీవలి కాలంలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.

అయోధ్య టాప్..

పంద్రాగస్టున ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం 464 కోట్లు, కరోనాపై ఐదోసారి మే 12న ఇచ్చిన సందేశానికి 425 కోట్ల వీక్షణలు నమోదైనట్లు బార్క్ తెలిపింది. అయితే భూమిపూజకు అత్యధిక వీక్షణలు రావటానికి కారణం.. కార్యక్రమం నిడివి(207 నిమిషాలు) కావచ్చని బార్క్ చీఫ్ సునిల్ లుల్లా అభిప్రాయపడ్డారు.

ప్రైమ్​టైమ్ న్యూస్​..

ఇటీవలి కాలంలో ఎంటర్​టైన్​మెంట్​ ఛానళ్లు(జీఈసీ) కూడా వార్తా ఛానళ్లు (ప్రైమ్​ టైమ్​)గా మారుతున్నాయని బార్క్​ వెల్లడించింది. హిందీ, మరాఠీ, బంగ్లా, కన్నడలో ఇలాంటి ట్రెండ్ అధికంగా ఉన్నట్లు తెలిపింది. కరోనా ముందు ఇది 41 శాతం ఉండగా ప్రస్తుతం 49 శాతానికి చేరినట్లు స్పష్టం చేసింది.

సుశాంత్ మరణం..

గడిచిన 3 వారాల్లో వార్తా ఛానళ్లలో బాలీవుడు నటుడు సుశాంత్ ఆత్మహత్య సంఘటన మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయంపై స్మార్ట్​ఫోన్​ వినియోగదారుల్లో వార్తల కోసం వెతికిన వారి సంఖ్య 48శాతం పెరిగిందని మార్కెట్ నిపుణుడు నీల్​ సేన్​ తెలిపారు.

ఇండియన్​ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైతే స్పోర్ట్స్​ విభాగంలోనూ వీక్షణలు పెరుగుతాయని లుల్లా తెలిపారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ అయోధ్య పర్యటన సాగిందిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.