ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ రాజకీయ భవిత ఆ 13 మంది చేతిలో?

మధ్యప్రదేశ్​లో నెక్​స్ట్​​ ఏంటి? రిసార్ట్ రాజకీయం ఇంకెంత కాలం? ఇప్పుడు అందరివీ ఇవే ప్రశ్నలు. సింధియా ఒక్కరే భాజపాలో చేరడం, తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 13 మంది సొంతగూటికి తిరిగి వస్తారని కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్ సింగ్​ అనడం మధ్యప్రదేశ్​ రాజకీయాల్ని మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.

Cong MLAs
మధ్యప్రదేశ్​లో ఆ 13 మంది కాంగ్రెస్​ గూటికి తిరిగొస్తారా?
author img

By

Published : Mar 11, 2020, 4:55 PM IST

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా ఒంటరిగానే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలంతా భాజపాలో చేరతారని అనుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా జరిగింది. సింధియా వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో 13 మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​ అనడం చర్చనీయాంశమైంది.

"వారు కాంగ్రెస్​ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు. సింధియాను రాజ్యసభకు నామినేట్​ చేయాలనే విషయంలో పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ విధంగా చేశారు. కమల్​నాథ్ నేతృత్వంలోని​ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది. మధ్యప్రదేశ్​లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మౌనంగా ఉండబోము. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం శివరాజ్​ సింగ్​ ప్రయత్నించినా.. అవి విఫలం కావడం వల్లే భాజపా జోతిరాదిత్యను రంగంలోకి దింపింది. జోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసినా.. ఆయన తన మనిషిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని సూచించారు. అందుకు కమల్​నాథ్​ నిరాకరించారు. కేంద్ర మంత్రి పదవి కోసమే సింధియా భాజపాలో చేరారు."

- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

దిగ్విజయ్​ వ్యాఖ్యలతో రిసార్ట్​ రాజకీయం మరింత వేడెక్కింది. ఇది ఎంత కాలం కొనసాగనుంది? మధ్యప్రదేశ్​ ప్రభుత్వానికి ఎంత మంది మద్దతు ఇస్తారు? భాజపాలో ఎంత మంది చేరతారు? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

సింధియాతోనే ఉంటా..

బెంగళూరులోని రిసార్ట్​లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే అక్కడికి చేరుకున్నట్లు ఇటీవలే రాజీనామా చేసిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఇమర్తి దేవి తెలిపారు. 'సింధియా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఎప్పటికీ ఆయనతోనే ఉంటాం. మేము కాంగ్రెస్​లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కమల్​నాథ్​ మా మాటను పట్టించుకోలేదు' అని చెప్పారు ఇమర్తి దేవి.

రాజీనామాలు ఆమోదిస్తే..

మధ్యప్రదేశ్ శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 230. ప్రస్తుతం 228 మంది సభ్యులు ఉన్నారు. అధికార కాంగ్రెస్​కు ఇంతకుముందు వరకు 114 మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ప్రస్తుతం 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 206కు పడిపోతుంది. కాంగ్రెస్​ బలం 92కు చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ బలం 104కు చేరుకోవటం వల్ల భాజపాకు ఉన్న 107 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.

అయితే.. రిసార్ట్​లో ఉన్న ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారు? ఎంత మంది భాజపాలో చేరతారు? అనే అంశాలపై స్పష్టత లేదు. బుజ్జగింపులు, ప్రలోభాలతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇరు పక్షాల నేతలు.

ఇదీ చూడండి: రాజకీయ చదరంగంలో రిసార్టులు, హోటళ్లే రక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.