ETV Bharat / bharat

రాజకీయ చదరంగంలో రిసార్టులు, హోటళ్లే రక్ష! - మధ్యప్రదేశ్ రాజకీయాలు

దేశంలో హోటల్ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర.. ఇప్పుడు మధ్యప్రదేశ్​లో పరిణామాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఎన్నికల్లో పోటాపోటీగా విజయం సాధించినప్పుడు ఇవే రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. బలనిరూపణ సమయానికి తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి ఆయా పార్టీలు. అయితే ఈ తరహా రాజకీయాలు ఈనాటివి కాదు. ఇరవై ఏళ్లలో ఇలాంటి పరిణామాలు చాలానే కనిపిస్తాయి.

hotel
హోటల్
author img

By

Published : Mar 11, 2020, 3:48 PM IST

Updated : Mar 11, 2020, 3:57 PM IST

దేశంలో రాజకీయాలు హోటల్‌ మెట్లు ఎక్కుతున్నాయి. ఖరీదైన రిసార్టులు, నక్షత్రాల హోటళ్లు వీటికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇవే సురక్షిత ప్రాంతాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. లేదంటే పిక్‌నిక్‌ల పేరిట ఎమ్మెల్యేలను వివిధ చోట్లకు తిప్పుతున్నాయి. ప్రత్యర్థి పక్షం గాలానికి దొరక్కుండా చూసుకోవడం దీని ముఖ్యోద్దేశం.

వివిధ రాష్ట్రాల్లో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివచ్చినప్పుడు.. బల నిరూపణ, విశ్వాస పరీక్షల్లో నెగ్గడం వంటి సందర్భాల్లో తరచూ హోటళ్లే రాజకీయాలకు కేంద్ర బిందువులవుతున్నాయి. ఒకరకంగా బల ప్రదర్శనలకూ ఇవే వేదికలవుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్​లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణ.

కాంగ్రెస్​పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా.. తన వర్గానికి చెందిన 22 ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ ఖరీదైన రిసార్టుకు తరలించారు. సందర్భాన్ని చూసి వారితో రాజీనామా చేయించారు. అనంతరం ఆయన భాజపాలో చేరారు.

ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ అధికార పగ్గాల్ని భాజపా కైవసం చేసుకునే అవకాశం ఉండటం వల్ల కాంగ్రెస్ జాగ్రత్త పడింది. పార్టీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలను జైపుర్​లోని ఓ హోటల్​కు తరలించింది.

మహారాష్ట్రలో..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో భాజపా, శివసేన మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా ఈ రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు హోటళ్లలోనే బస కల్పించాయి. అక్కడ్నుంచే రాజకీయం సాగించి చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

కర్ణాటకలో...

కొద్ది నెలల కిందట కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఏకైక పెద్దపార్టీగా అవతరించినప్పటికీ.. తగినంత బలం లేకపోవడం వల్ల కాంగ్రెస్‌, జేడీఎస్‌ జూన్‌లో స్వల్ప ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. బొటాబొటి మెజారిటీతోనే కుమారస్వామి నేతృత్వంలో ఏడాది పాటు పాలన సాగింది.

గత ఏడాది జులైలో రెండు పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే ముంబయిలోని ఓ హోటల్‌కు వెళ్లిపోయారు. వీరిని భాజపా తరలించిందన్న ఆరోపణలు వచ్చాయి. యడియూరప్ప సర్కారు తిరిగి గద్దెనెక్కేదాకా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అక్కడ్నుంచే రాజకీయాలు సాగించారు.

తమిళనాడులో...

తమిళనాడులో 2017లో ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకేలో లుకలుకలు తలెత్తాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసినప్పటికీ.. పార్టీలో అ'ద్వితీయ' నేతగా ఉన్న శశికళ ఒత్తిడివల్లే అలా చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఎదురుతిరిగారు.

శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమైన తరుణంలో ఆమె జైలుకెళ్లడం, అనంతరం పార్టీలోని ఓ వర్గానికి చెందిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తన అనుయాయులైన ఎమ్మెల్యేలను చెన్నైలోని ఓ రిసార్టుకు తరలించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఉత్తరాఖండ్‌లో...

2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరుగుబాటు ఎమ్మెల్యేలను బహిష్కరించడం వల్ల రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నాటి ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ తరుణంలో భాజపా తన ఎమ్మెల్యేలను జైపుర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారంటూ ఉభయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ దశలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించగా.. ఆ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది.

గత 20 ఏళ్లలో...

హోటళ్లకు ఎమ్మెల్యేలను తరలించే తతంగం ఈనాటిది కాదు. అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. గత 20 ఏళ్ల పరిణామాల్ని పరిశీలించినట్లయితే.. ఇలాంటి ఘటనలెన్నో కనిపిస్తాయి.

మహారాష్ట్రలో నాడు..

2002లో మహారాష్ట్రలో నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ సైతం 'హోటల్‌ రాజకీయాల'కు పాల్పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న శివసేన-భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేయకుండా వారిని బెంగళూరులోని ఓ విలాసవంతమైన రిసార్టుకు తరలించాయి. తమ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉన్నప్పటికీ, వీధి గొడవల్లేకుండా ఇలా తరలించినట్లు అప్పట్లో వివరణ ఇచ్చారు.

బిహార్‌లో...

అది 2000 సంవత్సరం. బిహార్‌లో రాజకీయం ముప్పిరిగొనడం వల్ల.. కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ)లు తమ ఎమ్మెల్యేలను పట్నాలోని ఓ హోటల్‌కు తరలించాయి. అప్పట్లో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ వారిని లాగేసుకుంటారన్న భయంతో రెండు పార్టీలు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈ చర్యకు పూనుకున్నాయి. కేవలం 7 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న నీతీశ్‌ విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోయారు. 2005లో భాజపా మద్దతుతో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం కోసం లోక్‌ జన్‌శక్తి పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను జంషెడ్‌పుర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది.

గుజరాత్‌లో...

గుజరాత్‌లో 2017 ఆగస్టులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు ఓటేయాల్సిన పార్టీ ఎమ్మెల్యేలెవరూ చేజారి పోకుండా వారిని తొలుత బెంగళూరు తరలించి బస ఏర్పాటుచేశారు. ఎన్నికలకు ఒక రోజు ముందు తిరిగి గుజరాత్‌కు తీసుకొచ్చి ఆనంద్‌ జిల్లాలోని ఓ రిసార్టులో ఉంచారు. పార్టీ సీనియర్‌ నేత శంకర్‌సింగ్​ వఘేలా కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో అప్పట్లో రాజ్యసభ ఎన్నికలను భాజపా, కాంగ్రెస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అంతకు కొద్ది రోజుల ముందే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​లో 'కమల్​' సర్కార్​ బలపరీక్షకు వేళాయే..!

Last Updated : Mar 11, 2020, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.