ETV Bharat / bharat

నీటిపై తేలిన కోతుల మృతదేహాలు.. కారణం? - అసోంలో కోతుల మృతి

అసోంలోని కాఛార్​ జిల్లాలో కోతుల మృతదేహాలు కలకలం రేపాయి. దాదాపు 13 వానరాలు.. ఓ నీటి సరఫరా ప్లాంట్​లో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఎవరో కావాలనే జలాశయాన్ని విషపూరితం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో నీటి అవసరాల కోసం జలాశయంపైనే ఆధారపడిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

13 monkeys found dead on reservoir in Assam
జలాశయంలో తేలిన కోతుల మృతదేహాలు.. కారణం!
author img

By

Published : Jun 9, 2020, 7:48 AM IST

Updated : Jun 9, 2020, 1:12 PM IST

దేశంలోని వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి. కేరళ ఏనుగు మృతిని మరువక ముందే.. అసోంలో మరో ఘటన చోటుచేసుకుంది. కాఛార్​ జిల్లాలోని ఓ రిజర్వాయర్​లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పబ్లిక్​ హెల్త్​ ఇంజినీరింగ్​ విభాగానికి చెందిన కటిరైల్​ నీటి సరఫరా రిజర్వాయర్​లో ఈ మృతదేహాలు తేలుతూ కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

నీటిపై తేలిన కోతుల మృతదేహాలు.. కారణం?

"ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ప్లాంటులో నుంచి వారికి నీరు అందుతుంది. 350కుపైగా కుటుంబాలు నీటి అవసరాల కోసం ఈ ప్లాంటుపై ఆధారపడుతున్నారు. కోతుల మృతదేహాలను అటవీశాఖ అధికారులు శవపరీక్షకు పంపించారు."

--- కటిరైల్​ నీటి సరఫరా ప్లాంటు అధికారి.

రిపోర్టులు అందిన తర్వాతే.. ఈ ఘటనకు గల కారణాలు స్పష్టమవుతాయని అధికారి వెల్లడించారు. అయితే ఎవరో దుండగులు జలాశయాన్ని విషపూరితం చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

గువాహటిలో ఓ చిరుతను అతి దారుణంగా చంపి.. దాని పళ్లు, గోర్లు తీసుకున్న ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇలా కోతుల మృతదేహాలు లభించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

Last Updated : Jun 9, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.