పిడుగుపాటుకు 13 మంది బలి...
బిహార్‌లో వరుస పిడుగు పాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 మంది పిడుగుపాటుకు బలయ్యారు.
పిడుగుపాటు కారణంగా పట్నా, భోజ్‌పుర్, బక్సర్, కైమూర్, సారణ్, జహానాబాద్ జిల్లాల్లో 13 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్న తరుణంలో విపత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించాలని ఆయన కోరారు.
ఇదివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడి 26 మంది మరణించారు. రాబోయే 2-3 గంటల్లో బిహార్‌లోని 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.