దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 12,881 కేసులు నమోదయ్యాయి. 334 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 1.16 లక్షల కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, దిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం అధికంగా ఉంది.
62 లక్షల మందికి పరీక్షలు..
దేశంలో గడచిన 24 గంటల్లో 1,65,412 శాంపిళ్లను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. జూన్ 17 వరకు 62,49,668 టెస్టులు చేసినట్లు స్పష్టం చేసింది.