ఝార్ఖండ్ దమ్కా జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే పోలీసులు అది అత్యాచారం, హత్యగా అనుమానిస్తున్నారు.
ట్యూషన్ నుంచి ఇంటికి బయలుదేరిన బాలిక.. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్డీ గ్రామ సమీపంలో విగతజీవిగా కనిపించింది. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే ఏం జరిగిందో నిర్ధరిస్తామని తెలిపారు.
"ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే.. బాలిక సామూహిక అత్యాచారానికి గురై చనిపోయనట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరమే అసలు విషయాన్ని నిర్ధరించగలుగుతాం"
-- ఎస్పీ అంబర్ లక్రా
బాధ్యులపై కఠిన చర్యలు తీసకోవాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంతి హేమంత్ సోరేన్ ఆదేశించారు. ఉప ఎన్నికలు జరగనున్న దమ్కా అసెంబ్లీలో ఈ ఘటన.. రాజకీయ దుమారానికి దారి తీసింది.
ఇదీ చూడండి:హాథ్రస్ ఘటనపై 'సిట్' దర్యాప్తు పూర్తి