రాజస్థాన్‌లోని సీకార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం శేఖ్పుర ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇళ్లంతా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జైపుర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వంట చేయడానికి గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నప్పుడు పెద్దఎత్తున మంటలు వచ్చి సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఉగ్ర గురువు హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష