భారత ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. బంగ్లా నుంచి ఎల్పీజీ గ్యాస్ దిగుమతి సహా మూడు ద్వైపాక్షిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ, హసీనా. భేటీ అనంతరం రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటికి సంబంధించిన అధికారికల పత్రాలపై సంతాకాలు చేశారు ఇరు దేశాల ప్రధానులు.
ఒక్క ఏడాదిలో బంగ్లా-భారత్‌ల మధ్య 12 ద్వైపాక్షిక ప్రాజెక్టులు ప్రారంభమైనందుకు హర్షం వ్యక్తం చేశారు మోదీ. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"బంగ్లా ప్రధాని హసీనాతో కలిసి మరో మూడు ద్వైపాక్షిక ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. గత ఏడాదిలో వీడియో లింక్ ద్వారా 9 ప్రాజెక్టులను ప్రారంభించాం. ఏడాదిలో మొత్తం 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ఈ రోజు ప్రారంభించిన మూడు ప్రాజెక్టులకు విభిన్న ప్రయోజనాలున్నాయి. ఎల్పీజీ దిగుమతి, వృత్తి విద్యా శిక్షణ, సామాజిక సదుపాయాలు.. మూడు ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఒక్కటే. ఇరు దేశాల అభివృద్ధిని పెంపొందిచడం. భారత్-బంగ్లాల సంబంధాలకు ఇదే మూల సూత్రం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని.