కరోనా మహమ్మారి నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంది కేరళకు చెందిన 110 ఏళ్ల బామ్మ.
మలప్పురంకు చెందిన రందతాని వారియత్ పతూ బామ్మకు తన కూతురి ద్వారా కరోనా సోకింది. ఆగస్టు 18న ఉత్తర కేరళలోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యుల చికిత్స, తన ఆత్మస్థైర్యంతో అవలీలగా కొవిడ్-19ను ఓడించింది.
పతూ బామ్మ కరోనాను జయించిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ. ఆమెకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇంటికి చేరుకున్న బామ్మ.. 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనుందన్నారు.
ఇదీ చదవండి: సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ