దేశంలో 18 ఏళ్లకే ఓటు వేయటానికి అవకాశం ఉంది. అయినా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోరు. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఓటు విలువను తెలియచెప్పేందుకు తిరుగులేని ఉదాహరణగా నిలిచారు మాజీ ఉపాధ్యాయుడు శ్యాం నేగి. వయసు 102. స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా కల్పా. స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన తీర్పును బ్యాలెట్లో, ఈవీఎంలో నిక్షిప్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో మే 19న లోక్సభ ఎన్నికలు. మరోమారు ఓటేసేందుకు సిద్ధమయ్యారు శ్యాం నేగి.
102 ఏళ్ల వయస్సులో మరోసారి ఓటు హక్కు వినియోగించుకోవటం చాలా సంతోషంగా ఉంది. - శ్యాం నేగి