ఒడిశా గంజాం జిల్లాలోని 10 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను రక్షించారు అటవీ అధికారులు. జర్దా ప్రాంతంలోని స్థానిక మౌసీమా ఆలయం సమీపంలో కోబ్రా తారసపడింది. దీంతో భయాందోళనకు గురైన ఆలయ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సమంటిపల్లి అటవీ శాఖ రేంజర్ రజత్ మిశ్రా.. సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. అయితే కోబ్రా మరీ పెద్దగా ఉండటం వల్ల బెర్హంపుర్లోని పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న బెర్హంపుర్ సిబ్బంది శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం.. అటవీ అధికారులు అడవిలో విడిచిపెట్టారు. ఆ కోబ్రా చాలా కాలం నుంచి ఆలయ పరిసరప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ