ETV Bharat / bharat

ఉగ్ర చొరబాటు భగ్నం.. ముష్కరుడు హతం - కశ్మీర్​లో ఉగ్ర చొరబాటును అడ్డుకున్న బలగాలు.. ముష్కరుడు హతం

కశ్మీర్​లో నియంత్రణ రేఖ దాటి భారత్​లోకి చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రముఠాను అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

infiltration
ఉగ్ర చొరబాటును అడ్డుకున్న బలగాలు.. ముష్కరుడు హతం
author img

By

Published : Jul 1, 2020, 10:18 AM IST

జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దును దాటేందుకు యత్నించిన పాకిస్థానీ ఉగ్రముఠాను సమర్థంగా అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

రాజౌరీ జిల్లాలోని ఖేరీ సెక్టార్​ వద్ద 400 మీటర్ల మేర భారత భూభాగంలోకి ఉగ్రమూకలు చొచ్చుకొచ్చాయి. అయితే వారిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఓ ఏకే 47 రైఫిల్, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతోంది సైన్యం.

ఇదీ చూడండి: డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.