ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదాలకు ఏటా 1.5 లక్షల మంది బలి! - రోడ్డు ప్రమాదాల వార్తలు లేటెస్ట్​

ఏటా దేశంలో దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. నాగ్​పుర్​లో రోడ్డు వారోత్సవాల ప్రారంభంలో ఈ విషయాలు తెలిపారు గడ్కరీ.

ACCIDENTS
నితిన్​ గడ్కరీ
author img

By

Published : Jan 12, 2020, 6:15 AM IST

Updated : Jan 13, 2020, 12:26 AM IST

దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. సంవత్సరానికి దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

నాగ్​పుర్​లో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సావ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. రోడ్డు వారోత్సవాలు జనవరి 17న ముగియనున్నాయి.

"దేశంలో ప్రతి ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి కారణంగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది గాయాలపాలవుతున్నారు. ఫలితంగా జీడీపీ 2 శాతం ప్రభావితమవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 62 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లే."

- నితిన్​ గడ్కరీ, కేంద్రమంత్రి, రోడ్డు రవాణా, రహదారులశాఖ

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని తగ్గించలేకపోయామని గడ్కరీ చెప్పుకొచ్చారు.

తమిళనాడులో రోడ్డు ప్రమాదాలను 30 శాతం నుంచి 29 శాతానికి తగ్గించడం అభినందనీయమన్నారు.

ట్రాఫిక్​ నిబంధనల పట్ల అవగాహన, నిబద్ధతతో పాటు పోలీసులు, ఆర్టీవోలు, ఎన్​జీఓల సంయుక్త కృషితో రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Intro:Body:

Barcelona: Barcelona and Uruguay forward Luis Suarez is set to undergo knee surgery on Sunday, revealed the Blaugrana club on Saturday.

"The first team player Luis Suarez will be operated on tomorrow Sunday by Dr Ramon Cugat for an injury to the external meniscus of his right knee," the club said in a statement.

Suarez,32, had made 23 appearances for Barcelona this season and found the net 14 times - 11 in the league and three in the Champions League. Suarez is also the leading assist provider in La Liga with seven.

His absence from the first team will come as a blow to the Catalan giants, with the club not currently possessing a like-for-like replacement in their squad, with Antoine Griezmann or Lionel Messi likely to be required to switch to a more advanced role.

Barcelona are currently at the top of La Liga with 40 points. The club will next face Granada at Camp Nou on January 20. 

Conclusion:
Last Updated : Jan 13, 2020, 12:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.