ETV Bharat / bharat

కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 78 శాతం ప్రభావవంతం - భారత్​ బయోటెక్​

కొవాగ్జిన్ టీకా.. కరోనా వైరస్​ను అడ్డుకోవడంలో 78 శాతం సమర్థతను ప్రదర్శించినట్లు భారత్ బయోటెక్‌, ఐసీఎం‌ఆర్‌ ప్రకటించాయి. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ అది ప్రాణాంతకంగా పరిణమించకుండా అడ్డుకోవడంలో కొవాగ్జిన్ టీకా 100 శాతం సమర్థతను రుజువు చేసుకుందని తెలిపాయి.

Covaxin
కొవాగ్జిన్​ 78 శాతం సమర్థత
author img

By

Published : Apr 21, 2021, 4:16 PM IST

భారత్‌ బయోటెక్, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా.. కొవిడ్‌ని అడ్డుకోవడంలో 78 శాతం సమర్థతను ప్రదర్శించినట్లు భారత్ బయోటెక్‌, ఐసీఎం‌ఆర్‌ ప్రకటించాయి. ఈ మేరకు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు వెల్లడించాయి. కరోనా సోకకుండా 78 శాతం మేర అడ్డుకోగలగదని తెలిపిన భారత్‌ బయోటెక్‌.. ఒకవేళ టీకా తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ అది ప్రాణాంతకంగా పరిణమించకుండా అడ్డుకోవడంలో కొవాగ్జిన్ టీకా 100 శాతం సమర్థతను రుజువు చేసుకుందని తెలిపారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితి లేకుండానే రోగులు కోలుకునేలా టీకా పనిచేస్తున్నట్లు తెలిపారు.

జూన్​లో ఫలితాలు..

కొవాగ్జిన్ మూడో దశ తుది విడత ఫలితాలు జూన్‌లో వెలువడుతాయని భారత్‌ బయోటెక్ తెలిపింది. ఈ మూడో దశ కోసం 25, 800 మంది వలంటీర్లను నియమించుకోగా.. వీరిలో 18 నుంచి 98 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు. కొవాగ్జిన్ రెండో డోస్ ఇచ్చిన.. 14 రోజుల తర్వాత వాలంటీర్లపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసి.. ఈ ఫలితాలు వెల్లడించారు.

ఫలితాలపై స్పందించిన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా కరోనాపై కోవాగ్జిన్ తన సమర్థతను రుజువు చేసుకుందని చెప్పారు. ప్రపంచస్థాయిలో.. అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసిన దేశీయ టీకా కొవాగ్జిన్.. కరోనా వ్యాప్తితో పాటు సోకిన వారికి ప్రాణాపాయం తప్పించడంలో అద్భుతంగా పని చేస్తోందని పేర్కొన్నారు. సార్స్‌- కోవ్‌-2 వైరస్‌తో పాటు వేరియంట్స్‌పై కొవాగ్జిన్ 78 శాతం సమర్థతతో పనిచేస్తుందని చెప్పేందుకు గర్విస్తున్నానని ఐసీఎమ్‌ఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ్ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: డబుల్​ మ్యుటేషన్లపైనా కొవాగ్జిన్ పనితీరు భేష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.