ETV Bharat / bharat

మీ ఇంట్లో తరచూ గొడవలా? - వాస్తు సమస్య కారణం కావొచ్చు - ఇలా చేస్తే అంతా సెట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 10:42 AM IST

Vastu Tips for Family Peace : ఏ కుటుంబంలోనైనా విభేదాలు సర్వసాధారణం. కానీ.. నిత్యం కుటుంబ సభ్యుల మధ్య కలహాలు చోటుచేసుకుంటుంటే, పెద్దగా కారణం లేకున్నా గొడవలు పడుతుంటే మాత్రం.. కచ్చితంగా మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనని చెబుతున్నారు నిపుణులు! మరి.. ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips for Family Peace
Vastu Tips for Family Peace

Vastu Tips for Family Peace in Telugu : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎలాంటి నిర్మాణం చేపట్టినా.. వాస్తు చూస్తారు. ఇక ఇంటి నిర్మాణం చేపట్టాలంటే.. కచ్చితంగా వాస్తు చూడాల్సిందే. చాలా మంది అద్దె ఇంట్లోకి వెళ్లినా వాస్తు చూసుకుంటారు. ఇంటి వాస్తు(Vastu Tips) సరిగ్గా లేకపోతే.. కుటుంబంలో సభ్యులు తలెత్తుతాయని వాస్తును నమ్మేవారంతా విశ్వసిస్తుంటారు.

అయితే.. వాస్తు ప్రభావం ఇంట్లోని వారిపై ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని అంటారు నిపుణులు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందనీ.. ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంటుందనీ.. ఆర్థికంగా నష్టం జరగవచ్చనీ.. ఇలా పలు విధాలుగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెబుతారు. ఇవి వాస్తు దోషం కారణంగానే జరుగుతాయని.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ఇంట్లో గొడవలు తగ్గాలన్నా.. మానసిక ప్రశాంతత లభించాలన్నా.. కొన్ని రకాల వాస్తు పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

ఇవి పాటించండి :

ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండానే ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నట్టయితే.. మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని భావించొచ్చని చెబుతున్నారు. ఈ కారణంగా నిత్యం గొడవలు జరుగుతుంటే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే.. ప్రతీ గది మూలలో రాక్‌ సాల్ట్​ ఉంచాలట. ఒక నెల రోజుల పాటు దొడ్డు ఉప్పను గది మూలలో ఉంచితే.. ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత ఈ రాక్ సాల్ట్​ను మార్చుతూ ఉండాలి. ఈ విధంగా నిత్యం చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందట. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా సమసిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. మీ ఇంట్లో బాత్​రూమ్ కూడా వాస్తు ప్రకారం లేకపోతే అందులోనూ ఓ మూలన రాక్ సాల్ట్​ను ఉంచితే వాస్తు దోషాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

వాస్తు దోషం ఉంటే పిల్లలు పుట్టరా? సంతానలేమికి దీనికి సంబంధమేంటి?

ఇలా ఫుల్​ స్టాప్ పెట్టండి :

ఇల్లు నిత్యం చక్కగా ఉండాలి. అలా కాకుండా.. మీ ఇంట్లో దుమ్ము, దూళి పేరుకుపోయి.. మురికిగా ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. అందుకే ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న గదుల మూలల్లో తప్పకుండా క్లీన్ చేయాలి.

మరో విషయం ఏమిటంటే.. ఇంట్లో మన పూర్వీకుల ఫొటోలను గోడలపై ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. నైరుతి దిశలో మాత్రమే ఉంచాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక చివరగా చెప్పే విషయం ఏమిటంటే.. గృహంలో చిరాకు తగ్గి, గొడవలు సమసిపోవాలంటే.. వాటర్‌ ఫౌంటెన్‌, బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలట! ఇలా పైన సూచించిన టిప్స్ పాటించడం ద్వారా మీ ఇంట్లోని గొడవలకు చెక్ పెట్టాలని సూచిస్తున్నారు.

దీపావళి వెలుగుల్లో వాస్తు - ఏ దిశలో ఏ రంగు దీపాలు వెలిగించాలో మీకు తెలుసా?

Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.