ETV Bharat / bharat

Best Shopping Malls in Hyderabad : హైదరాబాద్​లో ఉన్న 7 బెస్ట్ షాపింగ్ మాల్స్ ఇవే.. ఫెస్టివల్ షాపింగ్ అదిరిపోద్ది! - హైదరాబాద్​ బెస్ట్ షాపింగ్ మాల్స్

Best Shopping Malls in Hyderabad : "హైదరాబాద్"​.. దేశంలోని ది బెస్ట్ అనబడే మహానగరాల్లో ఒకటి. మరి, ఈ నగరంలో.. భారీ హంగులతో కూడిన షాపింగ్ మాల్స్.. వందలాదిగా ఉన్నాయి. మరి, వీటిలో ది బెస్ట్ అనే మాల్స్ ఎక్కడున్నాయో.. అవేంటో మీకు తెలుసా..? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Best Shopping Malls in Hyderabad
Best Shopping Malls in Hyderabad
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 2:30 PM IST

Updated : Oct 21, 2023, 3:04 PM IST

Hyderabad Best 7 Shopping Malls : హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి చార్మినార్, బిర్యానీ, ట్యాంక్​బండ్, మరికొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు. దేశవ్యాప్తంగా.. పర్యాటకులు అధికంగా సందర్శించే నగరాల్లో భాగ్యనగరం(Hyderabad) ఒకటి. ఇలాంటి నగరంలో ది బెస్ట్ అనే షాపింగ్ మాల్స్ కొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా.. వినోదం, ఆహారం, విశ్రాంతి కోసమూ ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. మరి, పండగల నేపథ్యంలో హైదరాబాద్​లో షాపింగ్ చేయాలని చూస్తున్నారా? మీ లాంటి వారికోసమే.. ది బెస్ట్ షాపింగ్ మాల్స్​(Shopping Mall) లిస్టు ఇక్కడ ఇస్తున్నాం.

సిటీ సెంటర్ షాపింగ్ మాల్(City Centre Shopping Mall) : హైదరాబాద్‌లోని అత్యుత్తమ షాపింగ్ మాల్స్‌లో ఒకటి. ఈ షాపింగ్ మాల్ అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. ఆహార ప్రియులకు స్వర్గధామం. యారో, అడిడాస్, బిబా, ముఫ్తీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల రిటైల్ అవుట్‌లెట్‌లు ఇందులో ఉన్నాయి. అనేక రకాల వినోదాలు కూడా ఇక్కడున్నాయి. ఈ మాల్​లో నాలుగో అంతస్తులో ప్రసిద్ధ గేమింగ్ అరేనా, SMAAASH ఉంది.

ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతం : బంజారాహిల్స్, హైదరాబాద్

టైమింగ్స్ : ఇది అన్ని రోజులు 11 AM - 9:30 PM వరకు తెరిచి ఉంటుంది.

ఇనార్బిట్ మాల్(Inorbit Mall) : దాదాపు అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న అత్యంత ప్రముఖమైన షాపింగ్ మాల్ ఇది. మీరు H&M, Vero Moda, Calvin Klein, Hush Puppies, Nike, Marks & Spencer లాంటి కొన్ని బ్రాండ్​లకు చెందిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. పండగల సీజన్‌లో ఆఫర్లు, డీల్స్​ ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తే.. మాల్‌లో మ్యాక్స్, లైఫ్‌స్టైల్, పాంటలూన్స్ కూడా ఉన్నాయి. మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఫ్యూజన్ 9, మ్యాడ్ అబౌట్ చైనా, బీర్ హౌస్, డైలాగ్ ఇన్ ది డార్క్, క్రీమ్ స్టోన్, ఇండియన్ తడ్కా లాంటి ఫుడ్స్ ఇక్కడ లభిస్తాయి. వీటన్నింటికీ అదనంగా, మాల్‌లో SMAAASH, PVR కూడా ఉన్నాయి.

ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రదేశం : మాదాపూర్, హైదరాబాద్

టైమింగ్స్ : 11 AM - 9:30 PM (రిటైల్), 11 AM - 11 PM (భోజనం)

ఫోరమ్ సుజనా మాల్(Forum Sujana Mall) : షాపింగ్ మాల్స్ ఈ రోజుల్లో మీ స్నేహితులతో సమావేశానికి, కలుసుకోవడానికి కూడా మంచి ప్రదేశంగా మారాయి. మరి, మీరు హైదరాబాద్‌లోని అలాంటి మాల్ కోసం వెతుకుతున్నట్లయితే.. ఫోరమ్ సుజనా మాల్ బెస్ట్ ఛాయిస్. హైదరాబాద్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద షాపింగ్ మాల్స్​లో ఇదొకటి. ఫారెవర్ 21, మార్క్స్ & స్పెన్సర్, హామ్లీస్, జారా, అడిడాస్, అలెన్ సోలీ, అన్ని ప్రధాన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉంది. సినీ ప్రేమికుల కోసం సినిమా హాళ్లు, వారికి ఇష్టమైన గేమింగ్ ఏరియా కూడా ఉన్నాయి.

ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతం : కూకట్‌పల్లి, హైదరాబాద్

టైమింగ్స్ : అన్ని రోజుల్లో 10 AM - 10 PM వరకు ఓపెన్ ఉంటుంది.

ఆన్​లైన్​ షాపింగ్​ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!

బాబూఖాన్ మాల్(Babukhan Mall) : 80,000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న బాబుఖాన్ మాల్ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల ఆసక్తికరమైన శ్రేణిని కలిగి ఉంది. గ్లోబల్ స్టోర్‌లలో లిస్ట్​ చేయబడిన తాజా ఉపకరణాలు, దుస్తులను చూడటం లేదా కొనుగోలు చేయడం ద్వారా మీరు సులభంగా ఒక రోజు గడపవచ్చు.

లొకేషన్ : సోమాజిగూడ, హైదరాబాద్

టైమింగ్స్​ : అన్ని రోజులు 10 AM - 11:00 PM వరకు తెరిచి ఉంటుంది.

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

జీవీకే వన్ మాల్(GVK One Mall) : GVK వన్ మాల్ హైదరాబాద్‌లో ఉన్న అత్యంత ఉత్తమ షాపింగ్ మాల్స్​లో ఒకటి. హై-ఎండ్ రిటైల్ షాపుల నుంచి మాత్రమే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు సూపర్ ఛాయిస్. 70కి పైగా అంతర్జాతీయ బ్రాండ్‌ వస్తువులు ఇందులో ఉంటాయి. Mac, Esprit స్టోర్‌ల నుంచి లూయిస్ ఫిలిప్, మాన్యవర్ వరకు మీరు ఇక్కడ నాణ్యమైన మెటీరియల్స్ కొనుగోలు చేయవచ్చు. మాల్‌లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్, గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అక్వేరియం పిల్లలతో సహా అందరికీ వినోదభరితమైన ప్రదేశం.

లొకేషన్ : బంజారాహిల్స్, హైదరాబాద్

టైమింగ్స్ : 11 AM - 9:30 PM (వారం రోజులు); 11 AM - 10 PM (వారాంతాల్లో)

MPM మాల్(MPM Mall) : ఈ మాల్ ప్రధాన బ్రాండెడ్ అవుట్‌లెట్‌ల నుంచి స్థానిక దుకాణాల వరకు ప్రతీ రకమైన షాపుహోలిక్‌లకు స్వర్గధామం. మీరు ఇక్కడ అత్యంత ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ పుష్కలంగా వినోద ఎంపికలు, ఫుడ్ అవుట్‌లెట్‌లు ఉన్నప్పటికీ.. మాల్‌లో మూడు అంతస్తులు పూర్తిగా కార్యాలయాలు, కార్పొరేట్ ప్రదేశాలకు అంకితం చేయబడ్డాయి. వారాంతాల్లో, జాతీయ సెలవుదినాలలో ఈ మాల్‌కు వెళ్లకపోవడం మంచిది. ఆ సమయాల్లో ఇది చాలా రద్దీగా ఉంటుంది.

లొకేషన్ : అబిడ్స్, హైదరాబాద్

టైమింగ్స్ : అన్ని రోజుల్లో 9:30 AM - 6:30 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

FMG మాల్(FMG Mall) : మరో సూపర్ మాల్.. FMG. ఏదైనా కొనుక్కోవాలనుకునే వ్యక్తుల కోసం.. వారు రాత్రిపూట ఆహ్లాదకరమైన డిన్నర్‌ ఆస్వాదించాలనే వారికి ఇది మంచి ఎంపిక. ఇక్కడ విక్రయించే చాలా ఉత్పత్తుల ధరలు సహేతుకంగా సరసమైనవి. అలాగే.. అమ్మకాలు, తగ్గింపులు ఏడాది పొడవునా అమలులో ఉంటాయి.

లొకేషన్ : అబిడ్స్, హైదరాబాద్

టైమింగ్స్ : అన్ని రోజుల్లో 10 AM - 10 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

How To Reduce Expenses And Save Money : పండగ షాపింగ్ చేస్తున్నారా?.. ఖర్చులు తగ్గించుకోండిలా!

Last Updated : Oct 21, 2023, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.