Best Recipes For Navratri Fasting 2023 : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నవరాత్రులలో భాగంగా.. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు.. 9 రూపాల్లో పూజించడమే కాకుండా.. ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. ఈ సమయంలో దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటారు.
Best 9 Recipes for Navratri Vrat 2023 : ఈ ఉపవాస సమయంలో తీసుకోవాల్సిన ఎంపిక చేసిన కొన్ని పదార్థాలను మాత్రమే తింటారు. ఉల్లిపాయ(Onion), వెల్లులి(Garlic), మాంసాహారంతో పాటు కొన్ని పప్పులు, కూరగాయలకు సైతం పూర్తిగా దూరంగా ఉంటారు. అయితే.. సరైన ఆహారం తీసుకోకపోతే పోషకాలు అందక నీరసం రావొచ్చు. అందుకే.. మీకోసం ఈ నవరాత్రుల(Shardiya Navratri 2023) సమయంలో శక్తినిచ్చే ఆహార పదార్థాలను పట్టుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Navratri 2023 : నవరాత్రుల్లో.. ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో మీకు తెలుసా..?
1. సబుదాన కిచిడీ(SABUDANA KHICHDI) : సబుదాన (టేపియోకా ముత్యాలు) నవరాత్రులలో ఒక ప్రసిద్ధ పదార్ధం. సబుదానా కిచిడీ చేయడానికి కావాల్సిన ఆహార పదార్థాలు నానబెట్టిన సబుదానా, వేరుశెనగలు, కొన్ని మసాలాలు అవసరం. ఇది సాధారణ రుచికరమైన వంటకం. దీనినే సబుదాన పోహ అని కూడా పిలుస్తారు.
2. కుట్టు కి పూరి(KUTTU KI PURI) : నవరాత్రి సమయంలో బుక్వీట్ పిండి (కుట్టు అట్ట) సాధారణంగా ఉపయోగిస్తారు. ఈ పిండితో పూరీలు లేదా పరాఠాలను తయారు చేసుకోవచ్చు. ఆలూ సబ్జీ (బంగాళదుంప కూర)తో వీటిని తినేయొచ్చు.
3. సింఘరే అట్టా కా హల్వా(SINGHARE ATTA KA HALWA) : వాటర్ చెస్ట్‌నట్ పిండి మరొక ఉపవాస పదార్ధం. మీరు ఈ పిండిని నెయ్యి, పంచదారతో వేయించి, డ్రై ఫ్రూట్‌తో అలంకరించుకొని రుచికరమైన తీపి హల్వాను తయారు చేసుకోవచ్చు.
4. ఫ్రూట్ సలాడ్(FRUIT SALAD) : యాపిల్స్, అరటిపండ్లు, దానిమ్మ వంటి పండ్లతో ఫ్రూట్ సలాడ్‌ను తయారు చేసుకోవడం. ఇది చాలా సులభమైన, ఆరోగ్యకరమైన ఎంపిక. మీరు అదనపు రుచి కోసం తేనె, కొన్ని చాట్ మసాలాలను యాడ్ చేసుకోవచ్చు.
5. మఖానా (ఫాక్స్ నట్స్) స్నాక్స్(MAKHANA (FOX NUTS) SNACKS) : కాల్చిన మఖానా క్రంచీ ఒక పోషకమైన చిరుతిండి. మీరు ఉపవాస సమయంలో వాటిని రాతి ఉప్పు, సెంద నమక్తో కలిపి తీసుకోవచ్చు.
Navratri 2023 Kanya Puja : నవరాత్రుల్లో కన్యా పూజ.. ఏ వయసు బాలికను పూజించాలో తెలుసా..?
6. ఆలూ జీరా(ALOO JEERA) : మీరు నవరాత్రుల ఉపవాసంలో ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని దానికి జీలకర్ర, పచ్చి మిరపకాయలు, సేంద నమక్ (రాక్ సాల్ట్)ను యాడ్ చేసుకుని రుచికరమైన సైడ్ డిష్‌ను తయారు చేసుకొని ఆరగించవచ్చు.
7. సామా బియ్యం (బార్న్యార్డ్ మిల్లెట్) కిచిడీ(SAMA RICE (BARNYARD MILLET) KHICHDI) : సామా బియ్యంను బార్న్యార్డ్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. సామా బియ్యం తీసుకొని, వాటికి బంగాళదుంపలు, వేరుశెనగలు కలిపి రుచికరమైన కిచిడీని తయారు చేసుకొని ఈ ఉపవాస సమయంలో ఆరగించవచ్చు.
8. పనీర్ టిక్కా(PANEER TIKKA) : మీరు పెరుగు, సెందా నమక్ ఉపయోగించి.. పనీర్ టిక్కాను తయారు చేయవచ్చు. మరింత రుచికరంగా రావడానికి పనీర్‌ను సుగంధ ద్రవ్యాలతో మెరినేట్ చేసి గ్రిల్ చేసుకుంటే సూపర్ ప్రొటీన్-ప్యాక్డ్ స్నాక్ రెడీ. దీనిని నవరాత్రులప్పుడు తీసుకొవచ్చు.
9. కొబ్బరి చట్నీ (COCONUT CHUTNEY) : తాజా కొబ్బరి, పచ్చి మిరపకాయలు, పెరుగుతో కలిపి చేసిన కొబ్బరి చట్నీని మీ ఉపవాస వంటకాలలో చక్కగా తీసుకోవచ్చు.
ఇలా పైన పేర్కొన్న వంటకాలను మీరు నవరాత్రుల సమయంలో తీసుకుంటే.. ఉపవాసం ఉన్నప్పటికీ నీరసం రాకుండా.. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్యంగా ఉంటారు.
Navratri Special Mehndi designs : నవరాత్రి మెహందీ.. ఈ అద్భుతమైన డిజైన్లు మీకోసం!