ETV Bharat / bharat

చలానా కోర్టులో కడతానన్నందుకు.. యువకుడిపై ట్రాఫిక్​ పోలీస్​ దాడి! - బెంగళూరు

bengaluru traffic police: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా బెంగళూరులోని కొందరు ట్రాఫిక్ పోలీసుల తీరు మారడం లేదు. అనేక ఫిర్యాదుల వల్ల టోయింగ్​ సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా యువకుడిని వేధిస్తున్న మరో వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

traffic police assualt
ట్రాఫిక్​ పోలీసు దురుసు ప్రవర్తన
author img

By

Published : Feb 10, 2022, 1:53 PM IST

Bengaluru traffic police: కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్​ పోలీసుల దురుసు ప్రవర్తనపై ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక చోట అలాంటి సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ యువకుడితో ట్రాఫిక్​ పోలీసు దురుసుగా ప్రవస్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్​ ఎస్సై యువకుడిని బెదిరిస్తున్న ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ట్రాఫిక్​ నిబంధనల ఉల్లంఘనల పేరిట.. తన బండిని తీసుకెళ్తున్న వాహనం వెంట ఓ యువకుడు పరుగెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.

ఇదీ జరిగింది..

చంద్రశేఖర్​ అనే ట్రాఫిక్​ ఎస్సై ఓ యువకుడికి 2,500 జరిమానా విధించారు. తన వద్ద ప్రస్తుతం నగదు లేదని.. వేతనం వచ్చాక కోర్టులో చెల్లిస్తానని చెప్పాడు బాధిత యువకుడు. దీంతో ఆగ్రహించిన పోలీసు అధికారి.. ఆ యువకుడిపై దాడి చేశారు. శిరస్త్రాణం తీసి పడేశాడు. వెంటనే 1,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించాడు. దీనిని ప్రశ్నించగా దాడి చేశాడు. ఈ క్రమంలో యువకుడి మెడపై గాయమైంది. వాహనం విడుదల కోసం వచ్చినప్పుడు అంతు చూస్తానని.. తనని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానంటూ యువకుడిని బెదిరించిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.

ఇదీ చదవండి: మహిళ ఘాతుకం- ఐదుగురిని చంపి.. అంత్యక్రియల్లో పాల్గొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.