ETV Bharat / bharat

యువతిపై గ్యాంగ్​ రేప్.. వీడియో తీసి, వైరల్​ చేసి... - బెంగళూరు పోలీసులు తాజా వార్తలు

బెంగళూరులో దారుణం జరిగింది. బంగ్లాదేశ్​కు చెందిన ఓ యవతిపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను తమ ఫోన్​లో చిత్రీకరించారు. అనంతరం మహిళను కేరళలో బంధించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్​గా మారగా.. బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధితురాలిని విడిపించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

gang rape
గ్యాంగ్​ రేప్​, సామూహిక అత్యాచారం
author img

By

Published : May 28, 2021, 2:34 PM IST

కర్ణాటకలో అమానుష ఘటన జరిగింది. బంగ్లాదేశ్​కు చెందిన ఓ యువతిపై కొంత మంది కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ దృశ్యాలను తమ ఫోన్​లో చిత్రీకరించారు. అనంతరం బాధితురాలిని కేరళలో నిర్బంధించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కేరళ కాలికట్​లోని నిర్బంధించిన బాధితురాలిని బెంగళూరులోని రామ్మూర్తి నగర్​ పోలీసులు విడిపించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

నిందితులైన రిదాయ్​ బాబు(ఏ1), రాకిబుల్​ ఇస్లాం సాగర్(ఏ2)​, మహమ్మద్​ బాబు షేక్​(ఏ3), అఖిల్(ఏ4)​, కాజల్(ఏ5)​, నజ్రత్​(ఏ6)ను రామ్మూర్తి నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా వ్యభిచార ముఠాకు చెందిన వారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బాధితురాలి జననాంగంలో సీసాను జొప్పించి, హింసించినట్లు వీడియోలో కనిపించిందని వెల్లడించాయి. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కేరళకు చేరుకున్న బెంగళూరుకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం.. నిర్బంధించిన బాధిత మహిళను విడిపించింది.

gang rape accused
నిందితులు

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

"సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిందితులకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటాం."

-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులను కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై ప్రశంసించారు.

పోలీసులపై దాడి.. ఎదురుకాల్పులు...

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించే క్రమంలో వారు పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. దాంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పారు. అయినప్పటికీ.. నిందితులు పంతం వీడకపోగా పిస్తోలుతో కాళ్లమీద కాల్పులు జరిపారని చెప్పారు. రిదాయ్​ బాబు, సాగర్​ అనే నిందితులు ఈ కాల్పుల్లో గాయపడ్డారని పేర్కొన్నారు. నిందితులపై పోలీసులు ఎప్​ఐఆర్​ నమోదు చేశారు. వారి వద్ద నుంచి 16 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలితో పాటు బంగ్లాదేశ్​ పౌరులైన నిందితుల్లో కొంతమంది భారత్​లో అక్రమంగా ఉంటున్నారని తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్​లో బాధితురాల్ని హింసిస్తున్న వీడియో వైరల్​గా మారింది. దాంతో అసోం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం వారు బంగ్లాదేశ్​ పోలీసులకు కుడా సమచారమిచ్చారు. ఆ తర్వాత బెంగళూరు పోలీసులకు తెలియజేయగా వారు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చూడండి: కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్​

ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.