ETV Bharat / bharat

ఒకే అపార్ట్​మెంట్​లో 27 మందికి కరోనా- బ్యాడ్మింటన్​ ఆడటమే కారణం - బ్యాడ్మింటన్​ గేమ్​తో ఒకే అపార్ట్​మెంట్​లో 27 మందికి కరోనా

Bengaluru Covid Cases: బెంగళూరులో ఓ బ్యాడ్మింటన్ ఈవెంట్ కారణంగా ఒకే అపార్ట్​మెంట్​కు చెందిన 27 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని కొవిడ్ క్లస్టర్​గా గుర్తించిన అధికారులు.. జాగ్రత్తలు తీసుకున్నారు.

Covid
కరోనా
author img

By

Published : Dec 29, 2021, 8:34 PM IST

Bengaluru Covid Cases: బెంగళూరులో ఒకే అపార్ట్​మెంట్​కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. అయితే.. వీరందరు వైరస్​ బారిన పడటానికి కారణం ఓ బ్యాడ్మింటన్ ఈవెంట్​ అని తెలుస్తోంది.

బెంగళూరులోని ఓకలిపురంలో అపార్ట్​మెంట్ వాసులు డిసెంబర్ 18న శోభా ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగిన తర్వాత కొందరు విదేశాలకు వెళ్లడానికి కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో టోర్నమెంట్‌లో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య కార్యకర్తలు. ఇందులో మొత్తం 27 మందికి కరోనా పాజిటివ్​ అని బయటపడింది.

అపార్ట్​మెంట్​ కాంప్లెక్స్​లోని రెండు టవర్లలో కేసులు వెలుగుచూసినట్లు ఆరోగ్య అధికారి బాలసుందర్ తెలిపారు. దీంతో అక్కడ జిమ్​లు, స్విమ్మింగ్​ పూల్స్​తో సహా పబ్లిక్ ప్రదేశాలను మూసివేసినట్లు పేర్కొన్నారు.

Omicron Cases In Bengaluru: బెంగళూరులో గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్​ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది.

ఇదీ చదవండి: విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఆంక్షల్లోకి మరిన్ని రాష్ట్రాలు!

విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఆంక్షల్లోకి మరిన్ని రాష్ట్రాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.