Bengaluru ACB raids: ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా.. ప్రభావితం చేస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 9 మంది ఇళ్లపై అనివీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. వీరిలో కొందరు మధ్యవర్తులు కాగా.. మరికొందరు ఏజెంట్లు ఉన్నారు. వీరు బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ దాడుల్లో నగరంలోని ఆర్టీ నగర్‌కు చెందిన మోహన్ అనే వ్యాపారవేత్త నుంచి 4.960కేజీల బంగారం, 15.02 కేజీల వెండి, 61.9 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
"బెంగళూరు నగరంలో అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం వారిపై రైడ్ చేశాము. వీరంతా బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో పని చేసే ఉద్యోగులను ప్రభావితం చేసి వారితో పని చేయించుుకుంటున్నట్లు అనుమానిస్తున్నాం. మొత్తం తొమ్మిది మంది ఇళ్లపై దాడులు జరిగాయి."
- అవినీతి నిరోధక శాఖ, కర్ణాటక
ఈ దాడుల్లో సుమారు 100 మంది అధికారులు భాగమైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరికి ఎస్పీ ఉమా ప్రశాంత్ నాయకత్వం వహించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ కిట్‌లో రబ్బరు పురుషాంగం- ఆశా వర్కర్లు షాక్