కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో బంగాల్లో భాజపా తన ప్రచార పంథాను మార్చుకుంది. ఏప్రిల్ 23న జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బహిరంగ సభలకు 500 మంది మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. వారంతా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
"కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 500 మంది మాత్రమే ప్రధాని సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ర్యాలీలో పాల్గొనే వారంతా మాస్కులు ధరించేలా, శానిటైజర్ వాడేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా సభలో కుర్చీలను ఉంచుతాం."
-కైలాశ్ విజయవర్గీయ, బంగాల్ భాజపా ఇన్ఛార్జ్,
ఏప్రిల్ 23న ముర్షిదాబాద్, దక్షిణ కోల్కతా, సియూరీ, మాల్దా ప్రాంతాల్లో మోదీ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ప్రధాని ప్రసంగాన్ని అందరూ వినేలా ఆయా నియోజకవర్గాల వారీగా ఎల్ఈడీ తెరలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: బంగాల్ ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర
ఇదీ చూడండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్ కుదించండి'