ETV Bharat / bharat

బంగాల్​ సీఐడీ చేతికి 'మమతకు గాయం' కేసు

author img

By

Published : Mar 20, 2021, 9:18 PM IST

బంగాల్​ ఎన్నికలకు నామినేషన్​ సందర్భంగా మమతా బెనర్జీ గాయపడ్డ కేసును సీఐడీ విచారణ చేపట్టనుందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. సీఐడీ బృందం త్వరలో పూర్వ మేదినిపుర్​ జిల్లాలో సంఘటన స్థలాన్ని సందర్శించి సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Bengal CID takes over probe into Nandigram incident in which Mamata was injured
'మమతకు గాయం కేసు'.. బంగాల్​ సీఐడీ చేతికి

బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 10న నందిగ్రామ్​లో నామినేషన్​ వేసే రోజు గాయపడ్డ కేసును సీఐడీ దర్యాప్తు చేయనుందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. సీఐడీ బృందం త్వరలో పూర్వ మేదినిపుర్​ జిల్లాలో సంఘటన స్థలాన్ని సందర్శించి సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సదరు అధికారి చెప్పారు. ఈ ఘటనపై టీఎంసీ నాయకుడు షేక్ సూఫియాన్ ఫిర్యాదుపై నందిగ్రామ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 341, సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్​ రోజు బీరులియా బజార్ ప్రాంతంలో మమత ఎడమ కాలికి గాయమైంది.

ఈ ఘటన అనంతరం చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం.. పూర్వ మేదినిపుర్​ ఎస్​పీ ప్రవీణ్​ ప్రకాశ్​ను సస్పెండ్​ చేసింది. భద్రతలో లోపాలను ఎత్తిచూపుతూ.. జిల్లా మేజిస్ట్రేట్ విభూ గోయెల్​ను బదిలీ చేసింది. సెక్యూరిటీ డైరక్టర్​ వివేక్​ సహాయ్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది.

గాయపడిన మమతా వీల్‌ఛైర్‌పైనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం సానుభూతి పొందేందుకు దీదీ చేస్తున్న కుట్రగా ఆరోపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.