ETV Bharat / bharat

టీ తోటల్లో పిడుగులు.. 24 మందికి తీవ్రగాయాలు

తేయాకు తోటలో పని చేస్తున్న కూలీలపై వరుసగా పిడుగులు (Lightning Strike) పడ్డాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

24 tea garden workers critically injured
తేయాకు తోటల్లో పిడుగులు
author img

By

Published : Sep 7, 2021, 1:31 PM IST

తేయాకు తోటలో పనికి వెళ్లిన వారిపై పిడుగులు (Lightning Strike) పడ్డాయి. బంగాల్​ జల్పాయిగుడి జిల్లాలోని దైనా తేయాకు తోటల్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో 24 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం సాయంత్రం జరిగిన ఒక ఘటనలో 17 మంది మహిళలు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని స్థానికంగా ఉండే మాల్​ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలీలు తేయాకులు తీస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు టీ గార్డెన్​ మెడికల్​ ఆఫీసర్​ ఎంకే సోనీ తెలిపారు.

మరో ఘటన.. సమీపంలోని చమూర్చి తేయాకు తోటలో జరిగింది. పిడుగులు పడడం వల్ల అక్కడ ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కూర రుచిగా లేదన్నందుకు.. తల పగులగొట్టిన భార్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.