ETV Bharat / bharat

ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ! - వ్యాక్సిన్​ తాజా వార్తలు

COVID-19 vaccine within 10 days
ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ!
author img

By

Published : Jan 5, 2021, 4:40 PM IST

Updated : Jan 5, 2021, 5:18 PM IST

16:33 January 05

ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ!

వారం రోజుల్లోనే భారత్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర అనుమతులు పొందిన 10 రోజుల్లోపే టీకాను తీసుకొస్తామని స్పష్టం చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే అని.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ తెలిపారు. 

ఈ నెల 3నే కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. జనవరి 13న వ్యాక్సినేషన్​ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ 100 శాతం సురక్షితం'

వ్యాక్సిన్​ డ్రై- రన్ ఫీడ్​బ్యాక్​ ఆధారంగా టీకా పంపిణీ చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ​దేశంలో కర్నాల్​, ముంబయి, చెన్నై, కోల్​కతాలోని 4 ప్రధాన కేంద్రాల్లో వ్యాక్సిన్ల నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్ చిన్న​ నిల్వ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.  

వారికి అవసరం లేదు.. 

టీకా కోసం కరోనా వారియర్లు తమ పేర్లను కో-విన్​ యాప్​లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అధికారులు. ఆరోగ్య సేవల సిబ్బంది జాబితా తమ వద్ద ఉందని, దాని ప్రకారమే వ్యాక్సినేషన్​ జరుగుతుందని వెల్లడించారు. 

భారత్​ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​ టీకా, ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్​ టీకాల అత్యవసర వినియోగానికి జనవరి 3న అనుమతులు ఇచ్చింది డీసీజీఐ.  

ఇదీ చూడండి: టీకా అనుమతులు వచ్చేశాయ్​.. పంపిణీ ఎలా?

Last Updated : Jan 5, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.