ETV Bharat / bharat

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం - బొమ్మై

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ థావర్​చంద్​ గహ్లోత్​.. బొమ్మైతో ప్రమాణం స్వీకారం చేయించారు.

new CM of karnataka
నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై
author img

By

Published : Jul 28, 2021, 11:06 AM IST

Updated : Jul 28, 2021, 12:32 PM IST

నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ప్రమాణం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ థావర్​చంద్​ గహ్లోత్..​ బొమ్మైతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం యడియూరప్ప సహా.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Basavaraj Bommai takes oath
ప్రమాణస్వీకారం చేస్తున్న బొమ్మై
Basavaraj Bommai takes oath
బొమ్మైతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ థావర్​చంద్​ గహ్లోత్
Basavaraj Bommai takes oath
కర్ణాటక నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ..

ప్రధాని శుభాకాంక్షలు..

pm modi tweet
ప్రధాని మోదీ ట్వీట్

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ప్రమాణం చేసిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మైకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన చట్టసభ నిర్వహణ, పరిపాలన అనుభావాన్ని తీసుకొచ్చారని ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. బలమైన ప్రభుత్వాన్ని బొమ్మై నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప చేసిన కృషిని మోదీ కొనియాడారు.

యడ్డీని కలిసి..

Basavaraj Bommai
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో బసవరాజ్‌ బొమ్మై

ప్రమాణస్వీకారానికి ముందు కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​లను బొమ్మై కలిశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

ఉదయం నుంచే పూజలు..

Basavaraj Bommai
మారుతీ ఆలయంలో ప్రత్యేక పూజలు
Basavaraj Bommai
ఆలయంలో బొమ్మై ప్రత్యేక పూజలు
Basavaraj Bommai
ఆలయంలో బొమ్మై ప్రత్యేక పూజలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న క్రమంలో బసవరాజ్‌ బొమ్మై ఉదయమే.. బెంగళూరులోని భగవాన్ శ్రీ మారుతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గొప్ప మనసున్న నేత..

బసవరాజ్ బొమ్మై​ గొప్ప మనసున్న నేత. కరోనా రెండో దశలో ఆయన చేసిన సేవ ఇందుకు ఉదాహరణ. కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు వెలుగుచూసిన మే నెలలో.. హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ)గా మార్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చినట్లు ఆయన కార్యాలయం ఆనాడు పేర్కొంది.

తండ్రి బాటలో..

కర్ణాటక పూర్వ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడైన బసవరాజ్‌- ఒకటిన్నర దశాబ్దాల కిందట జనతాదళ్‌ నుంచి భాజపాకు వలసవచ్చారు. ఇటీవలి దాకా హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు సామాజిక నేపథ్యమే నిచ్చెనమెట్టుగా అక్కరకొచ్చింది. లింగాయతులపై గట్టి పట్టున్న ప్రజాకర్షక నేత యడ్డీ స్థానాన్ని మరో వర్గం నాయకుడితో భర్తీ చేస్తారనే వార్తలు తొలుత వ్యాపించినా- భాజపా పెద్దలు అంతటి సాహసానికి ఒడిగట్టలేదు. లింగాయత్‌ ఓటుబ్యాంకును దూరం చేసుకుంటే అసలుకే మోసమొస్తుందన్న ముందుజాగ్రత్తతోనే ఇప్పుడు బొమ్మైకి పట్టంకట్టారు.

ఇవీ చదవండి:

కర్ణాటక నూతన సీఎం రాజకీయ ప్రస్థానమిదే..

కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం!

తండ్రులే కాదు.. కుమారులు కూడా ముఖ్యమంత్రులే

Last Updated : Jul 28, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.