ETV Bharat / bharat

66కు పెరిగిన మృతులు.. గజ ఈతగాళ్లతో గాలింపు

తౌక్టే తుపాను కారణంగా బార్జి పీ-305, వరప్రద టగ్​బోటులో చిక్కుకుని గల్లంతైన 20 మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆరో రోజు మరో 6 మృతదేహాలు లభ్యం కాగా.. మృతుల సంఖ్య 66కు చేరింది.

P305, Boat accident
బోటు ప్రమాదం, పీ305
author img

By

Published : May 23, 2021, 7:46 AM IST

అరేబియా సముద్రంలో తౌక్టే తుపాను ధాటికి కొట్టుకుపోయిన పీ-305 బార్జిలో, వరప్రద అనే టగ్​బోటులో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు నౌకాదళం గత ఈతగాళ్లను రంగంలో దించింది. ఆరు రోజులుగా గాలిస్తున్నప్పటికీ.. బార్జిలోని 9 మంది, టగ్​ బోటులోని 11 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. సోనార్​ స్కానింగ్​ సదుపాయమున్న ఐఎన్​ఎస్​ మకర్​, ఐఎన్ఎస్​ తరాస నౌకల్ని ముంబయి నౌకాదళం నుంచి శనివారం ఉదయం ఘటనా స్థలానికి పంపించారు. సముద్ర గర్భంలో శకలాలను పరిశీలించడంలో అవి దోహదపడుతున్నాయి.

గత సోమవారం(ఈ నెల 17న) ఈ ప్రమాదం సంభవించగా.. నాటి నుంచి శుక్రవారం వరకు 60 మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా.. మరో ఆరు బయటపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 66కు పెరిగింది. రోజులు గడుస్తున్న కొలదీ మిగిలిన ఇరవై మంది ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాత్రంతా అన్వేషణ కొనసాగుతూనే ఉందని నౌకాదళ వర్గాలు తెలిపాయి.

డీఎన్​ఏ పరీక్షలకు ఏర్పాట్లు

బార్జిలోని 261 మందిలో 66 మంది చనిపోగా.. 186 మంది బయటపడ్డారు. వరప్రద టగ్​లో 13 మంది ఉంటే.. ఇద్దరే ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇతర బార్జీలపై ఉన్న 440 మంది సురక్షితమే. తుపాను హెచ్చరికలు జారీ అయినా.. కల్లోలిత ప్రాంతంలోనే బార్జి ఎందుకు ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో కొన్ని గుర్తుపట్టేందుకు వీల్లేని స్థితిలో ఉన్నాయి. దీంతో డీఎన్ఏ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల రక్త సంబంధీకుల నుంచి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. రెండూ సరిపోలితే మృతదేహాల అప్పగింత పూర్తవుతుంది.

'నేనేమీ హెలికాప్టర్లలో తిరగట్లేదు'

ఈ ఘటనపై తాను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నానని, హెలికాప్టర్లలో తిరగడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు. కొంకణ్​ ప్రాంతంలో మొక్కుబడిగా తాను పర్యటించినట్టు భాజపా చేసిన విమర్శల్ని తిప్పికొట్టారు. 'నాలుగు గంటలసేపైనా నేను నేలపైనే పర్యటించాను. అంతేకానీ హెలికాప్టర్లలో కూర్చుని ఫొటోలకు ఫోజులివ్వలేదు. నేనే ఒక ఫొటోగ్రాఫర్​ని' అని చెప్పారు ఠాక్రే.

ఇదీ చదవండి: తీవ్రమవుతున్న 'యాస్'- శ్యామాప్రసాద్ పోర్టు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.