ETV Bharat / bharat

చిన్నవయసులోనే సరిహద్దు దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..

Bangladeshi Woman Arrested: భారత్​లో అక్రమంగా 15 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న బంగ్లాదేశ్​కు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. తనను తాను హిందువుగా పేరు మార్చుకుని బెంగళూరులో నివాసం ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Bangladeshi woman
12 ఏళ్లకే బోర్డర్ దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..
author img

By

Published : Jan 29, 2022, 11:05 AM IST

Bangladeshi Woman Arrested: 12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్​ బోర్డర్​ దాటింది. భారత్​లోకి ప్రవేశించింది. రోనీ బేగమ్ నుంచి పాయల్ ఘోష్​గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్​ల్లో డ్యాన్సర్​గా జీవనం ప్రారంభించింది. హిందువునని చెప్పుకుంటూ 15 ఏళ్లుగా భారత్​లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మరోసారి బంగ్లాదేశ్​కు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

Bangladeshi woman
బంగ్లాదేశ్​కు చెందిన రోనీ బేగమ్

"రోనీ 12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా భారత్​కు వచ్చింది. మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్​కుమార్​ను ప్రేమించి వివాహమాడింది. పెళ్లి తర్వాత బెంగళూరులోని అంజనానగర్​లో దంపతులు నివాసం ఉంటున్నారు. మూడేళ్లపాటు గాలించిన తర్వాత రోనీ ఆచూకీ ఆచూకీ లభించింది." అని పోలీసులు తెలిపారు.

అలా పోలీసులకు చిక్కి..

రోనీ.. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ వెళ్లాలని నిశ్చయించుకుంది. కోల్​కతా వెళ్లింది. అక్కడినుంచి ఢాకా వెళ్లాలని ప్లాన్ వేసింది. అయితే ఇమ్మిగ్రేషన్ డిపార్టెమెంట్​కు అందించిన ధ్రువపత్రాలపై అధికారులకు అనుమానం వచ్చింది. విచారణ అనంతరం.. రోనీ అక్రమంగా భారత్​లోకి వచ్చినట్లు తేలింది.

అప్పటికే రోనీ బెంగళూరు చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు స్థానిక పోలీస్ కమిషనర్​కు సమాచారం ఇచ్చారు. దీంతో బ్యాదరహళ్లి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రోనీకి పాన్​ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లభించేందుకు సాయపడిన వారి కోసం గాలిస్తున్నామని బెంగళూరు వెస్ట్ డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. అయితే రోనీ భర్త నితిన్​ కుమార్ కూడా పరారీలో ఉన్నాడని వివరించారు.

ఎల్​టీటీఈ ఉద్యమం కోసం..

ఎల్​టీటీఈ ఉద్యమం కోసం విరాళాలు సేకరిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన మేరీ ఫ్రాన్సిస్కోగా (40) గుర్తించారు పోలీసులు. మేరీ ముంబయి వెళ్లేందుకు యత్నిస్తుండగా.. చెన్నై ఎయిర్​పోర్టులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

భారత్, కెనడా, సింగపూర్, మలేసియా దేశాల్లో అక్రమ పత్రాలు సృష్టించి విరాళాలు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దేశంలో తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.