ETV Bharat / bharat

చెన్నై ఆలయంలో పేలుళ్లకు ప్రణాళిక.. చివరికి.. - జాతీయ దర్యాప్తు బృందం

బంగ్లాదేశ్​కు చెందిన ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో శనివారం అరెస్టు చేశారు బీఎస్​ఎఫ్ అధికారులు. చెన్నైలోని ఓ ఆలయంలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించినట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ) తెలిపింది.

errorist
ఉగ్రవాది
author img

By

Published : Aug 29, 2021, 7:40 AM IST

చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు.

ఎనిమిదేళ్ల నుంచి..

బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు చెందిన ఉగ్రవాది బిశ్వాస్(26).. ఎనిమిదేళ్ల క్రితం భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాడు. చెన్నైలో తలదాచుకున్నాడు. స్థానికంగా ఉన్న హిజబ్ ఉట్​ తాహేర్ అనే తిరుగుబాటు దళంతో చేతులు కలిపిన బిశ్వాస్.. చెన్నైలోని ఓ ఆలయంలో దాడులు చేసేందుకు ప్రణాళిక రచించారు.

అయితే జాతీయ దర్యాప్తు బృందం స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో బిశ్వాస్.. బంగ్లాదేశ్ పారిపోయే క్రమంలో బీఎస్​ఎఫ్​ అధికారులకు చిక్కాడు.

ఉగ్రవాదిని అరెస్ట్​ చేసిన అధికారులు.. బంగాల్​లోని బసిర్​హాత్​ స్టేషన్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.