ETV Bharat / bharat

మూడో శస్త్ర చికిత్సతో ఆ రోగికి ఐదో కిడ్నీ

author img

By

Published : Aug 11, 2021, 10:09 AM IST

తమిళనాడు చెన్నైలోని మద్రాసు మెడికల్​ మిషన్​ వైద్యులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి మూడో శస్త్ర చికిత్స చేసి ఐదో మూత్రపిండం అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Bangladeshi patient with 5 kidneys
రోగికి ఐదో కిడ్నీ

క్రానిక్‌ కిడ్నీ డిజార్డర్‌తో (సీకేడీ) బాధపడుతున్న వ్యక్తికి చెన్నైలోని మద్రాసు మెడికల్‌ మిషన్‌ (ఎంఎంఎం) ఆసుపత్రి వైద్యులు. ఆయన ఆరోగ్యం సక్రమంగా ఉందని వైద్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీకేడీతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు పని చేయడం మానేస్తాయని.. డయాలసిస్‌పై ఆధారపడాల్సి వస్తుందన్నారు.

41 ఏళ్ల రోగి అధిక రక్తపోటు, సీకేడీ సమస్యలతో బాధపడుతూ ఎంఎంఎం ఆసుపత్రిలో చేరారని, అంతకుముందు ఆయనకు వేరే ఆసుపత్రుల్లో నిర్వహించిన రెండు కిడ్నీ శస్త్ర చికిత్సలు విజయవంతం కాలేదన్నారు. రోగికి కరోనరీ ఆర్టెరీ సమస్య ఎదురైందని.. 3 నెలల క్రితం ట్రిపుల్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలున్న రోగికి జులై 10న 'అన్‌ కన్వెన్షనల్‌ ట్రాన్స్‌పెరిటోనియల్‌' విధానంలో శస్త్రచికిత్స చేశామని తెలిపారు. గతంలో అమర్చిన వాటితో కలిపి ఆయన శరీరంలో నాలుగు కిడ్నీలు ఉన్నాయని.. వాటి మధ్య ఐదోది ఏర్పాటు చేయడం సవాలుగా మారిందని వివరించారు.

అప్పటికే ఉన్న కిడ్నీలను తొలగిస్తే కొత్తదాన్ని సులువుగా ఏర్పాటు చేసి ఉండొచ్చని.. కానీ తీవ్ర రక్తస్రావమయ్యే ప్రమాదంతోపాటు.. కొత్త కిడ్నీ సక్రమంగా పని చేయకపోవచ్చని పేర్కొన్నారు. రోగి డిశ్ఛార్జి అయినప్పటి నుంచి పర్యవేక్షిస్తున్నామని.. ఆరోగ్యం బాగుందని వైద్యుడు ఎస్‌.శరవణన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 38వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.