ETV Bharat / bharat

Bangalore IT Raid Today : బిల్డర్​ ఇంట్లో రూ.40 కోట్లు లభ్యం.. మరోసారి ఐటీ దాడుల కలకలం - income tax raids in bangalore

Bangalore IT Raid Today : బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ క్రమంలో ఓ బిల్డర్​ ఫ్లాట్​లో రూ.40 కోట్లు లభ్యమయ్యాయి. ఇటీవల బెంగళూరులోని ఓ మాజీ కార్పొరేటర్​ బంధువు ఇంట్లో మంచం కింద రూ.42 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Bangalore IT Raid Today
Bangalore IT Raid Today
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 11:32 AM IST

Updated : Oct 15, 2023, 12:31 PM IST

Bangalore IT Raid Today : కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడుతుతోంది. ఇటీవల నగరంలో ఓ మాజీ కార్పొరేటర్ బంధువు​ ఇంట్లో రూ.42 కోట్లు బయటపడగా.. తాజాగా ఓ బిల్డర్ ఫ్లాట్​లో రూ.40 కోట్లు దొరికాయి. రాజాజీనగర్​ కేటమారనహళ్లిలోని బిల్డర్​ అపార్ట్​మెంట్​లోని 5వ అంతస్తులో శనివారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దొరికిన నగదు గురించి బిల్డర్​ను ఆరా తీయగా.. ఓ మాజీ ఎమ్​ఎల్​సీ పేరు చెప్పాడు. దీంతో సదరు ఎమ్​ఎల్​సీ సోదరులను అధికారులు బిల్డర్​ ఫ్లాట్​కు పిలిపించి విచారించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఆరా తీశారని సమాచారం. అయితే రూ.40 కోట్ల నగదు లభ్యమైన తర్వాత.. ఆరుకు పైగా కార్లలో పదుల సంఖ్యలో అధికారుల సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. సోదాలు ముగిశాక బిల్డర్​కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో దొరికిన డబ్బు గురించి మరింత సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నగదులో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారు.

మాజీ కార్పొరేటర్​ బంధువు​ ఇంట్లో..
అంతకుముందు గురువారం బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. ఆర్‌టీ నగర్‌.. ఆత్మానంద కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీబీఎంపీ మాజీ మహిళా కార్పొరేటర్​ బంధువు​ ఇంట్లో రూ.42 కోట్లు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలీసు సిబ్బందితో వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. మాజీ కార్పొరేటర్​ బంధువు​ ఇంట్లో తనిఖీలు నిర్వహించి పెట్టెల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్జాపుర్ సమీపంలోని ముల్లూరు, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, బీఈఎల్ సర్కిల్, మల్లేశ్వరం, డాలర్స్ కాలనీ, సదాశివనగర్, మట్టికేరి సహా పదికి పైగా చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Fve State Assembly Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​​ విడుదల చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అక్రమంగా నగదు తరలించే అవకాశం ఉండటం వల్ల.. ఐటీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగానే బెంగళూరులో దాడులు నిర్వహిస్తున్నారు. కూపీ లాగుతుండటం వల్ల భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. తెలంగాణలోనూ ఎన్నికల ఉండటం వల్ల ఇటీవల జరిగిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు, మాదకద్రవ్యాలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

పార్కింగ్​లోని కారులో రూ. 7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లు.. మ్యాట్​ కింద దాచిన వ్యాపారి

IT Raids in Hyd: 'పుష్ప' మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

Last Updated : Oct 15, 2023, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.