Bangalore IT Raid Today : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. బెంగళూరులోని కాంట్రాక్టర్లు, జ్యువెలరీ షాప్ యజమానులు, ప్రస్తుత, మాజీ బీబీఎంపీ కార్పొరేటర్ ఇళ్లలో సోదాలు జరిపింది. ఈ దాడిలో రూ.42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ కార్పొరేటర్ బంధువు ఇంట్లో..
IT Raids In Bangalore Today : ఆర్‌టీ నగర్.. ఆత్మానంద కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీబీఎంపీ మాజీ మహిళా కార్పొరేటర్ బంధువు ఇంట్లో రూ.42 కోట్లు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలీసు సిబ్బందితో వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. మాజీ కార్పొరేటర్ బంధువు ఇంట్లో తనిఖీలు నిర్వహించి పెట్టెల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్జాపుర్ సమీపంలోని ముల్లూరు, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, బీఈఎల్ సర్కిల్, మల్లేశ్వరం, డాలర్స్ కాలనీ, సదాశివనగర్, మట్టికేరి సహా పదికి పైగా చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు
మరోవైపు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నాలుగు రోజుల్లోనే తనిఖీల్లో రూ.37.07 కోట్ల విలువైన నగదు తదితరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం వరకు రూ.20.43 కోట్ల నగదు, రూ.14.66 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, రూ.89 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలు, రూ.87 లక్షల విలువైన మద్యం నిల్వలు, పంపిణీకి సిద్ధం చేసిన రూ.22.51 లక్షల విలువ చేసే వస్తువులను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఎన్నికల సమయంలో తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకోగా.. ఈసారి నాలుగు రోజుల్లోనే అందులో మూడోవంతు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్..
5 State Election Dates : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌంటింగ్, పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఆ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఖర్చు చేయకుండానే రూ.1000కోట్లు లెక్క.. 'హీరో' మెడకు ఐటీ ఉచ్చు!
పార్కింగ్లోని కారులో రూ. 7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లు.. మ్యాట్ కింద దాచిన వ్యాపారి