ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం 6నెలల తర్వాత తెరుచుకుంది. తెల్లవారుజామున 4.15గంటలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొంత మంది సాధవులు, పూజారులు, దేవస్థానం ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ప్రత్యక్ష దర్శనాలను రద్దు చేసిన దేవస్థానం.. భక్తుల సందర్శనార్థం ఆలయ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
హిమాలయాల్లోని నాలుగు పుణ్యక్షేత్రాల సందర్శనను ఛార్‌దామ్ యాత్రగా పిలుస్తారు. ఈనెల 14 న యమునోత్రి, 15న గంగోత్రి, 17న కేదార్‌నాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. హిమాలయాల్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల ఆరునెలలు మాత్రమే ఈ ఆలయాల ద్వారాలు తెరిచి ఉంటాయి.