Baby Born With 26 Fingers In Rajasthan : రాజస్థాన్‌లో కొద్దిరోజుల క్రితం ఓ నవజాత శిశువు 26 వేళ్లతో జన్మించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్ని వేళ్లతో పాప జన్మించడంపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కాగా.. చిన్నారి 26 వేళ్లతో జన్మించడంపై వైద్యులు ఎలా స్పందించారంటే?
'నా 32 ఏళ్ల వైద్య వృత్తిలో 26 వేళ్లతో ఓ బిడ్డ జన్మించడం చూడలేదు. చేతులు, కాళ్లకు ఆరు వేళ్లు ఉన్న పిల్లలను చాలా మందిని చూశాను. కానీ ఒక చిన్నారికి ఇన్ని వేళ్లు ఉండడం ఇదే మొదటిసారి. చిన్నారి వేళ్లను తొలగించేందుకు సర్జరీ చేయడం సాధ్యం కాదు. చిన్నారి, ఆమె తల్లి ఆరోగ్యంగా ఉన్నారు.' అని పీడియాట్రిషియన్ బీఎస్ సోనీ తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లో ఓ నవజాత శిశువు 26 వేళ్లతో జన్మించింది. ఆ చిన్నారి చెరో చేతికి 7 వేళ్లు ఉండగా.. ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 ఉన్నాయి. ఆ బిడ్డను ఆమె కుటుంబ సభ్యులు దేవతగా భావిస్తున్నారు. చిన్నారి పుట్టుక పట్ల సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. భరత్‌పుర్ జిల్లాలోని కామవాన్ పట్టణంలో శనివారం జరిగిందీ ఘటన.
సర్జూ దేవి అనే గర్భిణీ కామవాన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి కాళ్లు, చేతులకు కలిపి 26 వేళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జన్యులోపం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. కామవాన్ ఆస్పత్రిలో ఇలా ఇన్ని వేళ్లతో శిశువు జన్మించడం ఇదే మొదటిసారి అని అన్నారు. చిన్నారి 26 వేళ్లతో పుట్టిందని తెలిసి.. ఆమెను చూసేందుకు స్థానికులకు భారీగా తరలివచ్చారు. నవజాత శిశువును దేవతగా భావించి.. ఆమెకు చేతులెత్తి నమస్కరించారు.
'చిన్నారి జన్మించడం మా కుటుంబానికే శుభసూచికం'
చిన్నారి 26 వేళ్లతో జన్మించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారిని దేవతగా భావిస్తున్నారు. అలాగే.. నవజాత శిశువుకు 'లాలీ' అని పేరు పెట్టారు ఆమె తాత దీపక్ శర్మ. చిన్నారి జన్మించడం తమ కుటుంబానికి శుభసూచకమని అన్నారు. తమ కుటుంబంలోకి చిన్నారిని పంపినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడు సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌కు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.
నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. షాక్‌లో కుటుంబ సభ్యులు
యూట్యూబ్ చూసి పసికందును చంపిన మైనర్ తండ్రి.. కోడి రక్తంతో..