'దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి' అని కేంద్రానికి సవాల్ విసిరారు యోగా గురు బాబా రాందేవ్. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రభుత్వం తనను అరెస్టు చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ట్విట్టర్లో #ArrestRamdev హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడంపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ప్రామాణికతపై స్పష్టత లేదు.
అల్లోపతి వైద్యం, వైద్యులపైన ఇటీవల బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు రాందేవ్‌ను అరెస్టు చేయాలంటూ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : రాందేవ్ బాబాపై రూ.1000 కోట్ల పరువునష్టం దావా