ETV Bharat / bharat

బ్రిటిష్​ న్యాయవ్యవస్థను ఎదిరించిన భారతీయ జడ్జి.. పదవిని వదిలేసి..! - ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​

జస్టిస్‌ సయ్యద్‌ మహమూద్‌... భారత చరిత్రలో చాలా తక్కువగా వినిపించే పేరు. హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తలచుకోకుండా ఉండని చరిత్ర ఆయనది. ఇంగ్లాండ్‌ ప్రివీ కౌన్సిల్‌తోనే శభాష్‌ అనిపించుకున్న జస్టిస్‌ మహమూద్‌... న్యాయస్థానంలో ఆంగ్లేయుల అరాచకాన్ని నిలదీశారు. తెల్లవారి న్యాయపద్ధతులను తప్పుపట్టారు. చీఫ్‌ జస్టిస్‌తో విభేదించి.. చివరకు తన పదవినీ తృణప్రాయంగా వదులుకున్నారు.

justice syed mahmood
జస్టిస్​ సయ్యద్​ మహమూద్​, justice syed mahmood
author img

By

Published : Jun 19, 2022, 8:35 AM IST

ఇస్లామిక్‌ వ్యవహారాల నిపుణుడు సర్‌ సయ్యద్‌ కుమారుడు జస్టిస్‌ సయ్యద్‌ మహమూద్‌. 1850 మే 24న దిల్లీలో జన్మించిన ఆయన.. లండన్‌లో న్యాయశాస్త్రం చదువుకొని అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అరబిక్‌, సంస్కృతం, ఆంగ్లం, లాటిన్‌ భాషల్లో నైపుణ్యం ఆయనకు కలసి వచ్చింది. 1879లో మహమూద్‌ అవధ్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తండ్రి సర్‌ సయ్యద్‌ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వారికి సాయం చేసినందుకు కుమారుడికి ఈ పదవి ఇచ్చారనుకున్నవాళ్లు లేకపోలేదు. కానీ అవన్నీ తప్పని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. ఓ కేసులో మహమూద్‌ తీర్పును ఇంగ్లాండ్‌ ప్రివీకౌన్సిల్‌ మెచ్చుకుంది. ఇలాంటి తీర్పులిచ్చే న్యాయమూర్తి ఉండాల్సింది సెషన్స్‌ కోర్టులో కాదు.. హైకోర్టులో అంటూ కితాబిచ్చింది. ఫలితంగా.. 1882లో ఆయన 32 ఏళ్ల వయసులోనే అలహాబాద్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ హైకోర్టులో ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడు ఆయనే. మరో ఐదేళ్ల తర్వాత పూర్తి హోదా ఇచ్చినా.. ఆంగ్లేయ న్యాయమూర్తులకంటే స్థాయి తక్కువ.

జస్టిస్‌ మహమూద్‌ తీర్పులు మాత్రం వారి కంటే ఉన్నతంగా ఉండేవి. సమానత్వానికి, హక్కులకు ఆయన పెద్దపీట వేశారు. న్యాయస్థానంలో తన శ్రేణి తక్కువే అయినా.. శ్వేతజాతి న్యాయపద్ధతులను తప్పుపట్టడంలో ఏమాత్రం వెరవలేదు. అప్పట్లో... నిందితులు ప్రత్యక్షంగా కోర్టుకు రాకున్నా, వారి తరఫున వాదించేవారు లేకున్నా కూడా.. వారి వాదన విన్నట్లుగానే పరిగణించి తీర్పు చెప్పే సంప్రదాయం ఉండేది. దీన్ని తప్పుగా పరిగణించిన జస్టిస్‌ మహమూద్‌... ఈ విషయాన్ని ధర్మాసనానికి నివేదించారు. ప్రధాన న్యాయమూర్తి జాన్‌ ఎడ్జ్‌ సారథ్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం (ఇందులో జస్టిస్‌ మహమూద్‌ కూడా సభ్యులే) విచారించింది. ఆంగ్లేయ న్యాయమూర్తులు ముగ్గురూ పాత పద్ధతికే ఓటు వేయగా... జస్టిస్‌ మహమూద్‌ మాత్రం విభేదిస్తూ తీర్పు రాశారు. 'ప్రజలకు సరైన, సమాన అవకాశం కల్పించని ఈ బ్రిటిష్‌ ఇండియా చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా రద్దు చేయాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. మరో సందర్భంలో ఆంగ్ల భాషపై పట్టుదలను కూడా ఆయన తప్పు పట్టారు. బ్రిటిష్‌ న్యాయమూర్తులకు అర్థమయ్యేలా కేసు వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయించటం అప్పీల్‌ చేసిన వారి బాధ్యత. అలా చేయకుంటే కేసును విచారించకుండానే కొట్టేసేవారు. 'ఈ పద్ధతి డబ్బులున్నవారికి అనుకూలంగా ఉంది. తర్జుమా పేరుతో కేసును నిరాకరించటమంటే.. పేదలకు న్యాయాన్ని నిరాకరిస్తున్నట్లే!' అని జస్టిస్‌ మహమూద్‌ నిరసన తెలిపారు.

జస్టిస్‌ మహమూద్‌ తమతో విభేదిస్తూ తీర్పులివ్వటాన్ని ఆంగ్లేయ న్యాయమూర్తులు సహించలేకపోయారు. ముఖ్యంగా.. ప్రధాన న్యాయమూర్తి జాన్‌ ఎడ్జ్‌ అసూయతో ఆయనపై కక్ష కట్టి వేధించటం ఆరంభించారు. తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు తీర్పులు రాస్తున్నాడంటూ ఆరోపించారు. తండ్రి సహా చాలా మంది బ్రిటిష్‌వారితో పెట్టుకోవద్దని సలహా ఇచ్చారు. కానీ జస్టిస్‌ మహమూద్‌ తన అంతరాత్మ, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టడానికి ఇష్టపడలేదు. 1892లో న్యాయమూర్తి పదవిని వదులుకున్నారు. తర్వాతికాలంలో ఆరోగ్యం దెబ్బతిని 1903లో మరణించారు. భారత న్యాయచరిత్రలో ఆరుగురు గొప్ప న్యాయమూర్తుల పేర్లు చెప్పాలంటే.. వారిలో జస్టిస్‌ సయ్యద్‌ మహమూద్‌ పేరును తీసేసి చెప్పటం అసాధ్యం అని.. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిదాయతుల్లా చేసిన వ్యాఖ్యే ఆయన గొప్పతనానికి నిదర్శనం!

కేవలం శ్వేతజాతి న్యాయమూర్తులతోనే కాదు.. తండ్రి సర్‌ సయ్యద్‌తోనూ ఆయన విభేదించారు. సయ్యద్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు. జస్టిస్‌ మహమూద్‌ మాత్రం.. కాంగ్రెస్‌ పట్ల సానుభూతితో ఉండేవారు. అంతేగాకుండా హిందూముస్లింల ఐక్యతను నొక్కి చెప్పేవారు. "మతపరమైన విభేదాలున్నంత మాత్రాన.. హిందూ-ముస్లింలు కలసికట్టుగా చేసిందంతా తుడిచిపెట్టుకు పోవాల్సిన అవసరమేమీ లేదు. నా దృష్టిలో జాతీయ ఐక్యత చాలా అవసరం. అన్నింటికంటే మానవత్వం ఉన్నతం" అని వ్యాఖ్యానించారు జస్టిస్‌ మహమూద్‌. భారత్‌లో ముస్లిం చక్రవర్తి ఔరంగజేబు పాలన పద్ధతులను తీవ్రంగా విమర్శించటమేగాకుండా.. జాతిని, మతాన్ని ఆయన దిగజార్చారని జస్టిస్‌ మహమూద్‌ ఘాటుగా వ్యాఖ్యానించటం గమనార్హం. తండ్రితో కలసి అలీగఢ్‌లో ఆంగ్లో-ఓరియెంటల్‌ కాలేజీ (తర్వాత అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయమైంది) స్థాపించిన మహమూద్‌... ఇందులో.. ఆంగ్లం, అరబిక్‌లతో పాటు సంస్కృతం, ప్రాచీన వైద్యానికి కూడా పెద్దపీట వేయటం విశేషం.

ఇదీ చూడండి : నాయకులెవరూ లేని వేళ 'అరుణో'దయం.. క్విట్​ ఇండియాకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.