ETV Bharat / bharat

'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు' - Ayodhya Ram Mandir Tour Package

Ayodhya Ram Mandir Muhurtam In Telugu : అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని, ఆ సమయంలో ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. మరోవైపు, ఆలయ ప్రారంభోత్సవానికి నెలరోజులు కూడా లేని నేపథ్యంలో అయోధ్యలో హోటళ్లకు డిమాండ్ భారీగా నెలకొంది. హోటల్ రూమ్ రేటు రూ.లక్ష పలుకుతున్నట్లు టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు.

Ayodhya Ram Mandir Muhurtam In Telugu
Ayodhya Ram Mandir Muhurtam In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 4:08 PM IST

Ayodhya Ram Mandir Muhurtam In Telugu : అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం 84 సెకన్ల పాటు ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ( Ayodhya Ram Mandir Opening Date ) నిర్వహించనుండగా- ఆ రోజు మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఈ మేరకు ముహూర్తం వివరాలు వెల్లడించారు. మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి.

-గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, సంగ్వేద విద్యాలయ ఆచార్యులు

"అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో గురు స్థానం బలంగా ఉంటుంది. గురు రాజయోగం కల్పిస్తాడు. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు గురు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో ఈ ప్రతిష్ఠాపన జరుగుతుంది. గురు ఐదు, ఏడు, తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఏడో స్థానంలో గురు ఉంటే అందరి మనసులు చక్కగా ఉంటాయి. లక్ష సమస్యలను పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉంది."

'ప్రపంచంలో భారత్ కీర్తి పెరుగుతుంది'
సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని గణేశ్వర్ శాస్త్రి వివరించారు. అయితే, ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. మూడింట రెండొంతుల గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా మంచిదని పేర్కొన్నారు. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగితే ప్రపంచంలో దేశ కీర్తి మరింత పెరుగుతుందని తెలిపారు.

Ayodhya Ram Mandir latest photos
అయోధ్య రామ మందిర నిర్మాణం లేటెస్ట్ ఫొటోలు

హోటళ్లకు డిమాండ్- రూ.లక్ష దాటిన రేట్లు
ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యలో అయోధ్యలో హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల రేట్లు రూ.లక్షకు చేరాయి. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్ సాధ్యమవుతాయని అంటున్నారు. మరోవైపు, భద్రతా కారణాలతో అయోధ్యలో హోటల్ బుకింగ్స్​ను అధికారులు రద్దు చేస్తున్నారు.

Ayodhya Ram Mandir Tour Package : అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లు ఉన్నాయి. అందులో రెండు మూడు మాత్రమే 4స్టార్ హోటళ్లు. మిగిలినవన్నీ 2-3 స్టార్ హోటళ్లే. భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల హోటళ్లు సైతం రేట్లు పెంచేస్తున్నాయి. 4 స్టార్ హోటళ్ల విషయంలో ఈ రేటు రూ.లక్షకు చేరింది. దీంతో సాధారణ మధ్యతరగతి భక్తులకు అయోధ్యలో హోటళ్లు బుక్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో టూర్ ఆపరేటర్లు కొత్త ప్లాన్​తో ముందుకొస్తున్నారు. వారణాసి నుంచి అయోధ్యకు టూర్ ప్యాకేజీలు ప్రవేశపెడుతున్నారు. వారణాసిలో బస సౌకర్యం కల్పించి ప్రయాగ్​రాజ్, అయోధ్యకు తీసుకెళ్తామని చెబుతున్నారు.

Ayodhya Ram Mandir Muhurtam In Telugu
విదేశీ భక్తులకు పూలతో స్వాగతం
Ayodhya Ram Mandir Muhurtam In Telugu
భక్తులు

"ఇంతకుముందు కాశీధామ్​ దర్శనం కోసం వారణాసి వచ్చేవారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంతో భక్తులు కాశీనాథుడితో పాటు శ్రీరాముడి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్నారు. వారణాసిలో మార్చి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. రెండు రాత్రులు, మూడు పగళ్లతో కూడిన టూర్ ప్యాకేజీలతో పాటు 7 రాత్రులు 8 పగళ్లతో కూడిన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. భక్తులను వారణాసి, ప్రయాగ్​రాజ్, అయోధ్యకు తీసుకెళ్తాం. ఇప్పటివరకు 100కు పైగా బుకింగ్స్ వచ్చాయి. ప్యాకేజీ తీసుకోవాలంటే కనీసం ఇద్దరు ఉండాలి. 2 నైట్స్, 3 డేస్ టూర్​కు ఓ వ్యక్తికి రూ.8వేలు అవుతుంది. ఇంకా బుకింగ్స్ వస్తున్నాయి. కానీ, మార్చి తర్వాత అయితేనే సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో వెళ్లొచ్చని వారికి సూచిస్తున్నాం."
-సంతోష్ సింగ్, 'స్పిరిచువల్ టూర్' డైరెక్టర్

శంఖనాద బృందానికి ఆహ్వానం
మరోవైపు, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని మహారాష్ట్ర పుణెకు చెందిన కేశవ్ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్ మహాజన్​కు ఆహ్వాన పత్రిక పంపించారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి అక్కడ శంఖనాదం చేయనున్నారు.

"ఎన్నో ఏళ్ల నుంచి పుణెలోని ఆలయాల్లో, గణేశ్ మండపాల్లో మా బృందం శంఖనాద ప్రదర్శనలు చేస్తోంది. మా బృందంలో 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. 90 శాతం మంది మహిళలే. ఐదేళ్ల నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లభించడం చాలా సంతోషంగా ఉంది. 111 మంది కళాకారులు జనవరి 18న అయోధ్యకు వెళ్తారు" అని కేశవ్ శంఖనాద బృందం అధ్యక్షుడు నితిన్ మహాజన్ వివరించారు.

Ayodhya Ram Mandir Muhurtam In Telugu
కేశవ్ శంఖనాద బృందం
Ayodhya Ram Mandir Muhurtam In Telugu
శంఖం ఊదుతున్న బృందంలోని సభ్యులు
Ayodhya Ram Mandir Muhurtam In Telugu
కేశవ్ శంఖనాద బృందం

అయోధ్య రామ మందిరం ఓపెనింగ్​కు 1000 ప్రత్యేక​ రైళ్లు- ఎప్పట్నుంచంటే?

100 దేవతా విగ్రహాలతో భారీ ఊరేగింపు- రాముడి జీవితం ఉట్టిపడేలా అయోధ్యలో శోభాయాత్ర

2,500 ఏళ్లు చెక్కు చెదరకుండా అయోధ్య రామాలయం- అరుదైన ఆకారంలో గర్భగుడి

'అయోధ్య గుడి కట్టాకే పెళ్లి'- 31ఏళ్ల క్రితం రామ భక్తుడి శపథం- ఎట్టకేలకు కల సాకారం

అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.