ETV Bharat / bharat

అయోధ్య రాముడి విగ్రహ ఎంపికపై క్లారిటీ- ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆలయ ట్రస్ట్

author img

By PTI

Published : Jan 2, 2024, 7:34 PM IST

Updated : Jan 2, 2024, 7:59 PM IST

Ayodhya Ram Mandir Idol Selection : అయోధ్యలో ప్రతిష్ఠించే రామ్​లల్లా విగ్రహాల ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ తెలిపింది. ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది బయటకు చెబుతామని పేర్కొంది.

Ayodhya Ram Mandir Idol Selection
Ayodhya Ram Mandir Idol Selection

Ayodhya Ram Mandir Idol Selection : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో కొత్తగా నిర్మితమవుతున్న భవ్యరామ మందిరం మరికొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్‌ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో ప్రతిష్ఠించనున్న రామ్​లల్లా విగ్రహం ఎంపిక పూర్తయిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​. అయోధ్యలో ప్రతిష్ఠించే రామ్​లల్లా విగ్రహాల ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది బయటకు చెబుతామని పేర్కొంది.

అంతకుముందు అయోధ్యలో కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ తయారుచేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు అంటూ ఆయన పోస్ట్ చేశారు. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలోని గోకర్ణ అని చెప్పిన ప్రహ్లాద్‌ జోషి అక్కడే శ్రీరాముడి ప్రతిమ తయారుకావడం పట్ల హర్షంవ్యక్తం చేశారు. శ్రీరాముడు, హనుమంతుడి అనుబంధానికి ఇది ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఆరుణ్‌ తయారుచేసిన విగ్రహాన్ని రామాలయంలో ప్రతిష్టిస్తుండడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తల నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. రామ్​లల్లా విగ్రహ ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనడం గమనార్హం.

ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఇలా!
Ram Mandir Opening Ceremony : మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.

Last Updated : Jan 2, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.